Begin typing your search above and press return to search.

మాజీ న‌క్స‌లైట్ ద‌గ్గ‌ర ప్రియ‌మ‌ణి శిక్ష‌ణ‌?

By:  Tupaki Desk   |   16 Jun 2020 9:15 AM IST
మాజీ న‌క్స‌లైట్ ద‌గ్గ‌ర ప్రియ‌మ‌ణి శిక్ష‌ణ‌?
X
న‌క్స‌లిజం నేప‌థ్యంలో ఎన్నో తెలుగు సినిమాలు వ‌చ్చాయి. వాటిలో జాతీయ అవార్డులు అందుకున్న సినిమాలు ఉన్నాయి. ఇంత‌కు ముందు న‌రేష్ - శ‌ర్వానంద్ న‌టించిన గ‌మ్యం న‌క్స‌లిజం బ్యాక్ డ్రాప్ సినిమా. ఇటీవ‌లే నారా రోహిత్ న‌టించిన `ఒక్క‌డున్నాడు` న‌క్స‌లిజం నేప‌థ్యంలోని సినిమా. ఆ రెండు సినిమాల‌కు అవార్డులొచ్చాయి. ఇప్పుడు అదే తీరుగా న‌క్స‌లిజం నేప‌థ్యంలో వేణు ఉడుగుల ద‌ర్శ‌క‌త్వంలో `విరాట‌ప‌ర్వం` తెర‌కెక్కుతోంది. ఈ చిత్రంలో రానా - సాయి ప‌ల్ల‌వి నాయ‌కానాయిక‌లుగా న‌టిస్తుండ‌గా.. ఇందులో జాతీయ ఉత్త‌మ న‌టి ప్రియ‌మ‌ణి న‌క్స‌లైట్ పాత్ర‌లో క‌నిపించ‌నున్నారు.

ఇటీవ‌లే ప్రియ‌మ‌ణి బ‌ర్త్ డే సంద‌ర్భంగా ఫ‌స్ట్ లుక్ రిలీజైంది. కామ్రేడ్ భ‌ర‌త‌క్క పాత్ర‌లో ప్రియ‌మ‌ణి న‌టిస్తున్నారు. అందుకు సంబంధించిన లుక్ అంత‌ర్జాలంలో వైర‌ల్ అయ్యింది. ఈ పాత్ర‌ను ప్రియ‌మ‌ణి ఎంతో ఛాలెంజింగ్ గా తీసుకుని న‌టిస్తున్నారు. ఇక సాటి న‌క్స‌లైట్ల‌లో ఉద్య‌మ‌స్ఫూర్తిని ర‌గిలిస్తూ .. ఎంతో జోవియ‌ల్ గా ఉండే మ‌హిళా న‌క్స‌లైట్ గా ప్రియ‌మ‌ణి న‌ట‌న ర‌క్తి క‌ట్టిస్తుంద‌ని.. మ‌రోసారి జాతీయ అవార్డ్ రేంజ్ పెర్ఫామెన్స్ ని త‌న నుంచి ఆశించ‌వ‌చ్చ‌ని యూనిట్ లీకులందిస్తోంది.

తాజా స‌మాచారం ప్ర‌కారం.. ఆ పాత్ర కోసం ఒక మాజీ న‌క్స‌లైట్ వ‌ద్ద‌నే ప్రియ‌మ‌ణి శిక్ష‌ణ పొందార‌ట‌. తెలంగాణ ప్రాంతంలోని 1990 నాటి సామాజిక రాజ‌కీయ‌ పరిస్థితుల ఆధారంగా పీరియాడిక్ సోషల్ డ్రామాగా ఈ చిత్రం తెర‌కెక్కుతోంది. రానా పాత్ర‌లో ర‌క‌ర‌కాల వేరియేష‌న్స్ ఆక‌ట్టుకోనున్నాయి. అలాగే ద్వితీయార్థంలో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ హైలైట్ గా నిలుస్తాయ‌ట‌. తెలుగు- హిందీ- తమిళ భాష‌ల్లో ఈ సినిమా విడుద‌ల కానుంది.