Begin typing your search above and press return to search.

తండ్రి ఏటీఎం నుండి డబ్బులు దొబ్బేసేవాడట

By:  Tupaki Desk   |   3 Sept 2020 7:00 AM IST
తండ్రి ఏటీఎం నుండి డబ్బులు దొబ్బేసేవాడట
X
ప్రస్తుతం ఎంత పెద్ద స్టార్స్‌ అయినా కూడా చిన్నప్పుడు ఏదో ఒక సమయంలో చిలిపి పనులు చేసే ఉంటారు. కొందరు ఆ చిలిపి పనులు అల్లర్లను చెబుతారు మరి కొందరు మాత్రం చెప్పేందుకు సిగ్గు పడతారు. తాజాగా అలీతో సరదాగా టాక్‌ షో లో కమెడియన్‌ కమ్‌ హీరో అయిన ప్రియదర్శి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ప్రతి వారం అలీ టాక్‌ షో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతూనే ఉంది. ప్రముఖులతో అలీ చేసే చిట్‌ చాట్‌ చాలా సరదాగా ఉంటుంది. కొన్ని చిన్నప్పటి విషయాలను వారు షేర్‌ చేసుకుంటూ ఉండటంతో అంతా ఆసక్తి చూపిస్తున్నారు.

ప్రియదర్శి కూడా తన చిన్నప్పటి ఒక జ్ఞాపకాన్ని షేర్‌ చేసుకున్నాడు. చిన్న తనంలో నాన్న ఏటీఎం ను మెల్లగా తీసుకు వెళ్లి 50.. 100 రూపాయలను డ్రా చేసేవాడిని. అప్పట్లో మొబైల్‌ కు మెసేజ్‌ లు వచ్చే సిస్టం లేదు. కనుక వెంటనే బయట పడకపోయేవాడిని. ఎప్పుడో బ్యాంక్‌ స్టేట్‌ మెంట్‌ తీసినప్పుడు నాకు నాన్న రౌండ్‌ వేసేవాడు. అయినా కూడా మళ్లీ అదే పని చేయడం డబ్బులు తీసుకుని సినిమాలకు వెళ్లడం చేసేవాడిని.

నా డబ్బులు ఎక్కువగా సినిమాలకే ఖర్చు చేసేవాడిని అన్నాడు. ఇందులో తన ప్రేమ కథను కూడా అతడు చెప్పాడు. ప్రియదర్శికి సంబంధించి పూర్తి ఎపిసోడ్‌ ఈనెల 7వ సోమవారం ప్రసారం కాబోతుంది. ప్రోమో చూస్తుంటే ఇంటర్వ్యూ అంతా సరదా సరదాగా సాగిపోయినట్లుగా అనిపిస్తుంది.