Begin typing your search above and press return to search.

అ!.. దొంగ వంటోడు వచ్చాడు

By:  Tupaki Desk   |   29 Dec 2017 5:00 PM GMT
అ!.. దొంగ వంటోడు వచ్చాడు
X
2018 సంవత్సరం టాలీవుడ్ లో రిలీజ్ కాబోయే చాలా సినిమాలు చాలా కొత్తగా ఉండబోతున్నాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. అంతే కాకుండా ఆ సినిమాల్లో మన తారలు కూడా చాలా డిఫెరెంట్ గా కనిపించబోతున్నారు. ఏ సినిమా ఎంత డిఫెరెంట్ గా తెరకెక్కబోతోందో తెలియదు గాని నాని బ్యాక్ గ్రౌండ్ తో వస్తోన్న అ! సినిమా మాత్రం చాలా వినూత్నంగా ఉంటుందని చిత్ర యూనిట్ రిలీజ్ చేస్తోన్న పోస్టర్లను చూస్తుంటేనే అర్థం అవుతోంది.

ఇప్పటికే నిత్యా మీనన్ - శ్రీనివాస్ అవసరాల - ఈషా - రెజీనా - మురళి శర్మ వంటి తారాగణం ఫస్ట్ లుక్స్ ని వినూత్నంగా చూపించిన సంగతి తెలిసిందే. అంతే కాకుండా నాని వాయిస్ ఓవర్ ఇచ్చే చేప దర్శనం కూడా అయ్యింది. ప్రతి పోస్టర్ లో వారి పాత్ర మనసులో మెదిలేలా డిజైన్ చేస్తున్నారు. ఇక రీసెంట్ గా మరో నటుడి ఫస్ట్ లుక్ ని కూడా చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. అతను ఎవరో కాదు. ఇప్పుడిప్పుడే స్టార్ కమెడియన్ గా ఎదుగుతున్న ప్రియదర్శి.

పోస్టర్ లో మనోడు దొంగోడి లా కనిపిస్తున్నాడు. సినిమాలో కూడా క్యారెక్టర్ అదేనట. ప్రియదర్శి దొంగ వంటోడిగా గా కనిపించి కథను మలుపు తిప్పే పాత్రలో అలరిస్తాడట. పోస్టర్ లో అతని చూపులు చాలా గమ్మత్తుగా ఉన్నాయి. ఇక అతని దొంగతనం వీడియోని ఎవరో చూస్తున్నట్లు కొడుతోంది. మరి ఈ కమెడియన్ ఎలాంటి పని చేశాడో ఏంటో.. ప్రయోగాత్మకమైన ఈ అ! సినిమా షూటింగ్ ప్రస్తుతం చివరి దశలో ఉంది. ఇక మరికొన్నీ పాత్రల ఫస్ట్ లుక్స్ ని రిలీజ్ చేయాల్సి ఉంది. మరి వారి పోస్టర్స్ ఎలా ఉంటాయో ఏమో..