Begin typing your search above and press return to search.
నాడు కన్నుగీటింది.. నేడు పాటపాడింది.. ప్రియా వారియర్
By: Tupaki Desk | 1 Jan 2021 12:45 PM ISTసినిమా నటులకు కావాల్సింది పాపులారిటీ. కానీ.. ఎవరు, ఎప్పుడు, ఎలా ఫేమస్ అవుతారో ఎవ్వరికీ తెలియదు. కొంత మందికి ఎంత కష్టపడ్డా రాని పాపులారిటీ.. కొందరికి సింగిల్ డేలో వచ్చేస్తుంది. అలాంటి వారిలో ఒకరు ప్రియా వారియర్. కేవలం ఒకే ఒకసారి కన్నుకొట్టి, చేత్తో బుల్లెట్ దింపి, దేశవ్యాప్తంగా ఉన్న యువకుల హృదయాలను ధ్వంసం చేసింది.
‘ఒరు ఆడార్ లవ్’ అనే సినిమాలో నటించిన మలయాళీ ముద్దుగుమ్మ ప్రియా ప్రకాశ్ వారియర్.. ఆ సినిమాలోని ఓ సన్నివేశంలో కన్నుగీటుతుంది. సినిమా టీజర్ లో ఈ సీన్ పొందుపరిచాడు దర్శకుడు. ఇంకేముంది? రాత్రికి రాత్రే ప్రియా ప్రకాశ్ వారియర్ పెద్ద స్టార్‌గా మారిపోయింది. దేశవ్యాప్తంగా యూత్ ఆమెకు పడిపోయారు. ఆమెకు అవకాశాలు క్యూ కట్టాయి.
లేటెస్ట్ గా ఈ అమ్మడు తెలుగులో నితిన్ హీరోగా తెరకెక్కుతున్న ‘చెక్’ చిత్రంలో నటిస్తోంది. అదేవిధంగా.. ‘శ్రీదేవి బంగ్లా’ అనే మరో సినిమాలోనూ యాక్ట్ చేస్తోంది. త్వరలో ఈ రెండు సినిమాలు విడుదల కానున్నాయి.
కాగా.. ప్రియా ప్రకాశ్ వారియర్‌కు సంబంధించి ఎక్స్‌క్లూజివ్ సమాచారం ఒకటి తెలిసింది. అప్పుడు యూత్ కు కనుల విందు చేసిన ప్రియా.. ఇప్పుడు వీనుల విందు చేయడానికి సిద్ధమైంది. అప్ కమింగ్ మ్యూజిక్ డైరెక్టర్ శ్రీచరణ్ పాకాల రూపొందించిన ఓ ఆల్బమ్ లో ప్రియా వారియర్ ఓ పాట పాడింది. స్వతహాగా మంచి సింగర్ అయని ప్రియా.. ఇప్పటికే మలయాళం, కన్నడ భాషల్లో పాటలు పాడి మెప్పించింది. ఇప్పుడు తెలుగు ఆడియన్స్ కూ తన గానమాధుర్యాన్ని వినిపించడానికి సిద్ధమైంది. అప్పుడు కన్నుగీటి యూత్ కంటికి నిద్రలేకుండా చేసిన ఈ సుందరి.. పాటతో మైమరపించి ఏ లోకాలకు తీసుకెత్తుందో చూడాలి మరి.