Begin typing your search above and press return to search.

ఆస్కార్ కి చేరిన ప్రియ వైరల్ వింక్

By:  Tupaki Desk   |   5 March 2018 5:42 AM GMT
ఆస్కార్ కి చేరిన ప్రియ వైరల్ వింక్
X
ఒక్కసారి ఇలా కన్నుగీటి దేశం మొత్తాన్ని ఆకర్షించిన మలయాళీ భామ ప్రియా ప్రకాష్ వారియర్.. చాలానే సెన్సేషన్స్ కు సిద్ధమవుతోంది. ఈ వీడియో వైరల్ అయిన తర్వాత.. ఒక్క రోజులోనే 6 లక్షల మందికి పైగా ఫాలోయర్స్ ను పెంచుకుని.. ఇన్ స్టాగ్రామ్ రికార్డుల్లో కూడా చోటు సంపాదించింది. ఇప్పుడు ప్రియా వారియర్ కన్నుకొట్టడం.. ఏకంగా ఆస్కార్ కు చేరిపోయింది. అకాడమీ అవార్డ్స్ ప్రదానోత్సవంలో భాగంగా చాలానే హంగామా జరుగుతూ ఉంటుంది.

స్టేజ్ పై ఎంతటి సందడి ఉంటుందో.. అంతకు పదింతలు బ్యాక్ స్టేజ్ హడావిడి ఉంటుంది. ఈ బ్యాక్ స్టేజ్ లో పాక్-అమెరికన్ యాక్ట్ర కుమయిల్ నంజియాని.. లుపిత నైయాంగ్ లు.. ప్రియ వైరల్ వింక్ వీడియోను ఇమిటేట్ చేశారు. కనురెప్పలు తిప్పడం కుమయిల్ రిపీట్ చేస్తే.. లుపిత ముద్దుతో ఊరించింది. ఏకంగా అకాడమీ అవార్డ్స్ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్ లో ఈ ఇమిటేషన్ వీడియో షేర్ చేయడంతో.. ఇది కూడా వైరల్ అయిపోయింది. మళ్లీ ఒరు అదార్ లవ్ గురించి..ప్రియా వారియర్ కన్నుగీటు గురించి మాట్లాడుకునే అవసరం ఏర్పడింది.

తన హావభావాలతో దేశం మొత్తాన్ని అలరించిన ప్రియా వారియర్.. ఇప్పుడు ఏకంగా ప్రపంచం మొత్తం ఆకర్షించే రేంజ్ కి వచ్చేసింది. విడుదలకు ముందే వస్తున్న ఈ క్రేజ్ ను.. ప్రియా వారియర్ ఎలా ఉపయోగించుకుంటుందో.. ఒరు అదార్ లవ్ విడుదల తర్వాత ఇంకెంత వైరల్ అవుతుందో చూడాలి.