Begin typing your search above and press return to search.

ఆ రెండింటిపైనే వింక్ గర్ల్‌ ఫ్యూచర్‌

By:  Tupaki Desk   |   10 March 2021 11:30 AM GMT
ఆ రెండింటిపైనే వింక్ గర్ల్‌ ఫ్యూచర్‌
X
ఒరు ఆదార్ లవ్‌ అనే మలయాళం సినిమాలో కన్ను గీటే సన్నివేశం.. ముద్దుగన్ను పేల్చే సన్నివేశంతో మొత్తం సోషల్ మీడియాను తన వైపు తిప్పుకున్న ముద్దుగుమ్మ ప్రియా ప్రకాష్‌ వారియర్‌. ఆ రెంటితో యావత్‌ దేశంలోని కుర్ర కారు గుండెల్లో గుబులు రేపిన ముద్దుగుమ్మ భవిష్యత్తులో పెద్ద స్టార్‌ అవుతుందని అప్పుడు అనుకున్నారు. కాని ఆమె కెరీర్‌ పూర్తి స్థాయిలో ఆరంభం కూడా కాకుండానే అంతం దిశగా పరుగులు పెడుతున్నట్లుగా అనిపిస్తుంది. పాపం వింక్ గర్ల్‌ మొదటి సినిమా ఒరు ఆదార్ లవ్ అన్ని భాషల్లో విడుదల అయినా ఏ ఒక్క భాషలో కూడా సక్సెస్ అవ్వలేదు. ఆ తర్వాత ఈమె కు పెద్దగా ఆఫర్లే వచ్చింది లేదు.

హిందీలో శ్రీదేవి బంగ్లా సినిమాను చేసిన ఈ అమ్మడు తెలుగులో రెండు సినిమా లు చేసింది. శ్రీదేవి బంగ్లా సినిమా విడుదలకు న్యాయపరమైన చిక్కులు ఏర్పడ్డాయి. దాంతో సినిమా విడుదల ఎప్పుడు అనే విషయమై క్లారిటీ లేదు. మరో వైపు తెలుగులో ఈమె చెక్‌ సినిమా ను చేసింది. కాని ఆ సినిమా నిరాశ పర్చింది. ఇక ఈమె తేజ సజ్జతో కలిసి ఇష్క్‌ సినిమా ను చేస్తోంది. ఇష్క్‌ మరియు శ్రీదేవి బంగ్లా సినిమా లు మాత్రమే ఈమె కెరీర్‌ ను డిసైడ్‌ చేయబోతున్నాయి. ఈ రెండు సినిమాల ఫలితాలు తారు మారు అయితే ఈ వింక్‌ బ్యూటీ మళ్లీ వెండి తెరపై కనిపించడం అనుమానమే అన్నట్లుగా విశ్లేషకులు కామెంట్స్ చేస్తున్నారు.