Begin typing your search above and press return to search.

క‌న్ను గీటిన పిల్ల‌... తెలుగు ఎంట్రీ?

By:  Tupaki Desk   |   21 Feb 2018 7:23 AM GMT
క‌న్ను గీటిన పిల్ల‌... తెలుగు ఎంట్రీ?
X
సినిమా ఇండ‌స్ట్రీలో ఓవ‌ర్‌ నైట్ స్టార్ అయిపోయింది ప్రియా ప్ర‌కాష్ వారియ‌ర్‌. క‌నుబొమ్మ‌ల‌తో మాయ చేసి... క‌న్ను కొట్టి కుర్ర‌కారుతో స‌హా నాలుగైదు సినిమా ఇండ‌స్ట్రీల‌నే ప‌డేసింది. ఆమె ఇంటి చుట్టూ ఇప్ప‌టికీ కుర్రాళ్లు కాపు కాస్తున్నార‌ట‌... ఆమెను ఒక్క‌సారి చూడ‌డానికి. ఆ పిల్ల త్వ‌ర‌లో తెలుగులో న‌టించ‌బోతున్న‌ట్టు స‌మాచారం.

ఒరు అడార్ ల‌వ్ సినిమా షూటింగ్ ప్ర‌స్తుతం జ‌రుగుతోంది. కాలేజీలో టీనేజీ ల‌వ్ స్టోరీ చుట్టూ జ‌రిగే క‌థ‌. అందులో ఒక హీరోయిన్ ప్రియా ప్ర‌కాష్‌. ప‌ద్దెనిమిదేళ్ల ఈ పిల్ల‌... అప్ప‌టివ‌ర‌కు పెద్ద‌గా ఎవ‌రికీ తెలియ‌దు. ఒరు అడార్ ల‌వ్ సినిమా పాట‌లోని 26 సెక‌న్ల పాట‌ను విడుద‌ల చేశారు. అందులో ప్రియా ప్ర‌కాష్ క‌ళ్లు మాయ చేశాయి. క‌నుబొమ్మ‌ల‌తో డ్యాన్స్ చేసింది. చివ‌ర‌లో క‌న్ను కొట్టి కుర్రాళ్ల‌ను ప‌డ‌గొట్టేసింది. ఆమె చూపు - న‌వ్వుని అంత సులువుగా ఎవ‌రూ మ‌ర్చిపోలేక‌పోయారు. ఓవ‌ర్‌ నైట్‌ లో స్టార్ అయిపోయింది. ఇప్పుడామెకు సినిమా అవ‌కాశాలు కుప్ప‌లుగా వ‌స్తున్నాయి. కానీ ఆమె దేనికి ఓకే చెప్ప‌లేదు. ఇప్పుడు ఒక తెలుగు సినిమాలో న‌టించేందుకు ఒప్పుకుంద‌ట‌.

ఒరు అడార్ ల‌వ్ సినిమాను ఓ ద‌ర్శ‌కుడు తెలుగులోకి తీసేందుకు సిద్ద‌మ‌య్యాడు. తెలుగులో కూడా త‌న పాత్ర‌ను తానే చేయ‌డానికి ఒప్పుకుంద‌ట ప్రియా ప్ర‌కాష్‌. సినిమాలో షూటింగ్ త్వ‌ర‌లో మొద‌ల‌వ్వ‌నుంది. ఇందులో హీరోగా ఆశిష్ రాజ్ అనే కుర్రాడు చేయ‌బోతున్నాడు. ఇగో అనే సినిమాలో ఇత‌ను న‌టించాడు.