Begin typing your search above and press return to search.
మహేష్27 పై ఇంతకన్నా సిల్లీ పుకారు ఉండదేమో
By: Tupaki Desk | 2 May 2020 1:00 PM ISTసినిమా ఇండస్ట్రీ గురించి సోషల్ మీడియాలో రెగ్యులర్ గా ఏవో ఒక రూమర్ వస్తూనే ఉంటుంది. చిన్న హింట్ దొరికితే దాన్ని మరోలా సోషల్ మీడియాలో ఈమద్య ప్రచారం చేయడం ఈమద్య కామన్ అయ్యింది. సోషల్ మీడియా పోస్ట్ లు అప్పుడప్పుడు ఎలక్ట్రానిక్ మీడియా వెబ్ మీడియాలో కూడా ట్రెండ్ అవుతూ ఉంటాయి. అయితే తాజాగా వచ్చిన ఒక రూమర్ మాత్రం మరీ సిల్లీగా ఉంది. అసలు ఇలాంటి పుకార్లు ఎలా పుట్టిస్తారో అర్థం కావడం లేదు.
మహేష్ బాబు 27వ చిత్రం గురించి ఈమద్య కాలంలో ఎక్కువ వార్తలు వస్తున్నాయి. అవి ట్రెండ్ అవుతున్న కారణంగా తాజాగా మరో కొత్త పుకారు పుట్టుకు వచ్చింది. అదే మలయాళి వింక్ బ్యూటీ ప్రియా ప్రకాష్ వారియర్ ను మహేష్ బాబు 27వ చిత్రం కోసం పరశురామ్ సంప్రదించాడట. మహేష్ తో నటించేందుకు చాలా ఆనందంగా ప్రియా ప్రకాష్ ఒప్పుకుంది అనేది ఆ వార్త సారాంశం. ఇది మరీ సిల్లీ పుకారు. మహేష్ బాబు రేంజ్ కు ఆమెతో రొమాన్స్ ఏంటీ అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
మహేష్ బాబుకు జోడీగా ఎవరు నటించబోతున్న విషయం ఇంకా నిర్ణయించబడలేదు. ప్రస్తుతం దర్శకుడు పరశురామ్ స్క్రిప్ట్ పైనే వర్క్ చేస్తున్నాడు. ఆ స్క్రిప్ట్ పూర్తి అయ్యి.. ఫైనల్ వర్షన్ స్క్రిప్ట్ మహేష్ బాబుకు నచ్చిన తర్వాత అప్పుడు సినిమా ఓకే అవుతుంది. ఆ తర్వాత హీరోయిన్ గురించిన చర్చ మొదలవుతుంది. కాని కొందరు మాత్రం అప్పుడే హీరోయిన్ వరకు వెళ్లారు.
మహేష్ బాబుకు జోడీగా ఈ చిత్రంలో బాలీవుడ్ హీరోయిన్ ను ఎంపిక చేసే అవకాశం ఉందని మాత్రం చెబుతున్నారు. ఎందుకంటే పాన్ ఇండియా లెవల్ లో ఈ సినిమాను విడుదల చేయాలని భావిస్తున్నారట. అందుకే హిందీ హీరోయిన్ అయితే బాగుంటుందనే అభిప్రాయంలో మేకర్స్ ఉన్నారట.