Begin typing your search above and press return to search.

షాపింగ్ మాల్ లో కన్నుగీటిన పాప

By:  Tupaki Desk   |   2 April 2018 1:09 PM GMT
షాపింగ్ మాల్ లో కన్నుగీటిన పాప
X

మలయాళీ చిన్నది ప్రియా ప్రకాష్ వారియర్ గురించి ఇప్పుడు దేశంలో యువతకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. గ్లామర్ ప్రియులకు అయితే.. ఈమె నామ జపం సర్వ సాధారణం అయిపోయింది. ఒక్కటంటే ఒక్క సినిమా రిలీజ్ కాకుండా.. కేవలం కొన్ని సెకండ్ల వీడియోతో హల్ చల్ చేసేసి.. వైరల్ అయిపోయిన ప్రియా ప్రకాష్ వారియర్.. ఒక్క కన్నుగీటుతో దేశంలో కుర్రాళ్లను అందరినీ తన అభిమానులుగా చేసేసుకుంది.

ఇప్పుడు ప్రియా ప్రకాష్ ఓ సెలబ్రిటీ అయిపోయింది అనడంలో సందేహం అక్కర్లేదు. గతంలో అయితే ఈమె ఎక్కడికైనా వెళితే ఎవరూ గుర్తు పట్టేవారు కాదేమో కానీ.. ఇప్పుడు మాత్రం బైట కనిపిస్తే చాలు.. ప్రియను ఇట్టే పట్టేస్తున్నారు. సెల్ఫీల కోసం వెంట బడుతున్నారు. రీసెంట్ గా ఈ బ్యూటీ తన ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తో కలిసి ఓ షాపింగ్ మాల్ కి వచ్చింది. అంతగా మేకప్ లేకుండా.. జస్ట్ క్యాజువల్ గా.. రెడ్ కలర్ డ్రెస్ లో షాపింగ్ చేసేందుకు వచ్చిన ఈ బ్యూటీని ఫ్యాన్స్ కం ఫాలోయర్స్ గుర్తు పట్టేశారు.

వైరల్ పాప కళ్ల ఎదురుగా కనిపించేసరికి వీడియోలు తీయడం మొదలుపెట్టేశారు. ఎస్కలేటర్ ఎక్కి పైకి వస్తున్న వీడియో.. షాపింగ్ చేస్తున్న క్లిప్.. వంటివి అన్నీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసేశారు. తనను గుర్తు పట్టి పలకరించిన వారితో సెల్ఫీలు ఫోటోలు దిగేందుకు ప్రియా ప్రకాష్ వారియర్ ఏ మాత్రం సంకోచించలేదు. ఆ వీడియో కూడా ఇప్పుడు నెట్ లో వైరల్ గా చక్కర్లు కొట్టేస్తోంది.

వీడియో కోసం క్లిక్ చేయండి