Begin typing your search above and press return to search.

మొదట కన్నుగీటింది.. ఇప్పుడు చీర కట్టి చిచ్చురేపుతుంది!

By:  Tupaki Desk   |   13 Jun 2020 11:30 AM GMT
మొదట కన్నుగీటింది.. ఇప్పుడు చీర కట్టి చిచ్చురేపుతుంది!
X
ప్రియా ప్రకాష్ వారియర్.. కుర్రకారుకి పరిచయం అక్కర్లేని పేరు. కేవలం కన్నుగీటిన ఒక్క వీడియోతో దేశవ్యాప్తంగా ఓవర్ నైట్ సెన్సేషన్ గా మారిపోయింది. ఓరు ఆధార్ లవ్ సినిమాలో ప్రియా కన్నుగీటిన హావభావాలు కుర్రాళ్ళ హృదయాల్లో చిచ్చు రేపాయని చెప్పాలి. ఒరు ఆధార్ లవ్ సినిమాలోని ఫస్ట్ పాట విడుదలయ్యే వరకు ప్రియా వారియర్ అంటే ఎవరికీ తెలియదు. కానీ ఆమె కన్నుగీటిన వీడియో గతేడాది యూట్యూబ్ లో సంచలనం సృష్టించి వైరల్ అయిన సంగతి తెలిసిందే. కేవలం కన్నుగీటి సామాన్యుడి నుండి సెలబ్రిటీ వరకు అందరిని ఫిదా చేసింది. ఆ ఒక్క వీడియో తర్వాత అమ్మడికి అన్ని సినీ ఇండస్ట్రీల నుంచి అవకాశాలు కోకొల్లలుగా మొదలయ్యాయి. తొలి సినిమాతోనే ప్రియా ప్రకాష్ క్యూట్ లుక్స్ తో విశేషంగా ఆకట్టుకుంది.

గ్లామర్ షో కూడా పెద్దగా చేయలేదు భామ.. ఇప్పుడు కమర్షియల్ యాడ్స్ లో కూడా కనిపిస్తుంది. గ్లామర్ షో చేస్తే క్రేజ్ మరింత పెరుగుతుందని అమ్మడికి ముందే తెలుసనుకుంటా.. ఈ మధ్య సోషల్ మీడియాలో గ్లామర్ పెంచేసింది. తాజాగా ఈ కేరళ ముద్దుగుమ్మకు అందాలు ఆరబోయడానికి రెడీగా ఉంటోంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఫోటో షూట్లు షేర్ చేస్తోంది. తాజాగా అమ్మడు చీర కట్టి ముస్తాబైన ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రియాకి సోషల్ మీడియాలో 7మిలియన్ల ఫాలోయర్స్ ఉన్నారు. చీర కట్టిన దేశి లుక్ లో ఉన్న అమ్మడు యూత్ గుండెలను బ్రేక్ చేస్తుంది. వైట్ ఎల్లో సారీలో.. అలా తల సైడ్ చేసిన లుక్.. అదరహో అని చెప్పాలి. మరి అమ్మడు త్వరలో ఏదైనా తెలుగు సినిమాలో మెరుస్తుందేమో చూడాలి!