Begin typing your search above and press return to search.

మెగా ఆఫర్ ను రిజెక్ట్ చేసిన వింక్ బ్యూటీ?

By:  Tupaki Desk   |   26 Nov 2018 6:46 AM GMT
మెగా ఆఫర్ ను రిజెక్ట్ చేసిన వింక్ బ్యూటీ?
X
సోషల్ మీడియా పుణ్యమాఅని దేశవ్యాప్తంగా ఓవర్నైట్ సెన్సేషన్ గా మారిన వారిలో మలయాళం ముద్దుగుమ్మ ప్రియా వారియర్ కూడా ఉంది. 'ఒరు ఆదార్ లవ్' సినిమాలో 'మాణిక్య మలరాయ పూవి' అనే పాట ప్రోమో వీడియోలో ప్రియా కన్నుగీటడం.. ఆ వీడియో కాస్తా మిలియన్ల కొద్దీ వ్యూస్ తెచ్చుకోవడంతో ప్రియాకు డిమాండ్ పెరిగింది. యూత్ లో ప్రియాకు భారీ ఫాలోయింగ్ వచ్చేసింది. ఒక్క ఇన్స్టాగ్రామ్ లోనే ఆమెకు 6 మిలియన్స్ ఫాలోయింగ్ ఉందంటే మన ఆమె క్రేజ్ అర్థం చేసుకోవచ్చు. తాజాగా ప్రియా ఒక తెలుగు సినిమా ఆఫర్ కు నో చెప్పిందట.

ఈమధ్యనే మెగాస్టార్ చిరంజీవి రెండో అల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా ఒక సినిమా ప్రకటన వచ్చింది. ఈ సినిమాలో హీరోయిన్ గా తీసుకునేందుకు ప్రియాను సంప్రదించారట. కానీ ఆమె ఈ ఆఫర్ ను ఒప్పుకోలేదని సమాచారం. ఆమెకు స్టార్ హీరోల సినిమాలో హీరోయిన్ గా చేయాలని ఉందని అందుకే రెమ్యూనరేషన్ కోటి రూపాయల దాక చెబుతోందని అంటున్నారు. మీడియం బడ్జెట్ సినిమాలకు ఎలాగూ ఆ రేంజ్ రెమ్యూనరేషన్ ఇవ్వరు కాబట్టి ఆమెను తీసుకోరు. గతంలో కూడా దిల్ రాజు బ్యానర్లో మీడియం రేంజ్ సినిమాలకు ఆఫర్స్ ఇస్తే అలానే చేసిందట.

మరి ఆమెకు తగ్గట్టు కోటి రూపాయల రెమ్యూనరేషన్ ఇచ్చి ఈ అందాన్ని కన్నుగీటడానికి సిద్ధం అయ్యే ఆ టాప్ స్టార్ ఎవరో వేచి చూడాలి. ఏదేమైనా వచ్చిన ఆఫర్లను కంటెంట్ బాగుంటే యాక్సెప్ట్ చేయకుండా ఇలా స్టార్ హీరోలతోనే చేయాలనే అలోచన ఏమిటో..!