Begin typing your search above and press return to search.

సెన్సేషనల్ పిల్ల 'తుపాకీ'తో వచ్చింది

By:  Tupaki Desk   |   13 Feb 2018 6:30 PM GMT
సెన్సేషనల్ పిల్ల తుపాకీతో వచ్చింది
X
ఒక్క రోజుల ఆరు లక్షల మంది ఫాలోవర్లను సాధించుకున్న పిల్ల అంటే మామూలు క్రేజ్ ఉండదుగా. అందుకే రాత్రికి రాత్రి ఇప్పుడు ఆ పిల్లను సెంటర్ ఆఫ్‌ ఎట్రాక్షన్ గా చేస్తూ సినిమా ప్రమోషన్లను కూడా మొదలెట్టేరు. అవును.. ‘ఒరు ఆదార్ లవ్’ సినిమా గురించే చెబుతున్నాం. మొన్నామధ్యన ఒక పూర్తి ఐదు నిమిషాలు పాటను రిలీజ్ చేస్తే.. అందులో మరో ఇద్దరు హీరోయిన్లు ఉన్నా కూడా.. రెండు కనురెప్పలనూ లయబద్దంగా ఎగరేసి.. ప్రియ ప్రకాష్‌ వారియర్ సృష్టించిన అలజడి అంతా ఇంతా కాదు. ఇప్పుడు అదే పిల్ల తుపాకీతో ఒక కిస్సును ఇస్తే ఎలా ఉంటుంది?

అదిగో రాత్రికి రాత్రి ఇప్పుడు ఈ సుందరిని సెంటర్ ఆఫ్‌ అట్రాక్షన్ చేస్తూ ఒక టీజర్ కూడా కట్ చేశారు. ఆ టీజర్ ను రిలీజ్ చేశారు. అయితే ఈ సినిమాలో అమ్మడు కేవలం కనుబొమ్మలు ఎగరేయడమే కాదు.. ఇంకా చాలా పరాచికాలు ఆడేసినట్లుంది. తన రెండు వేళ్ళతో పెదాల నుండి ఒక కిస్సును బయటకు లాగి.. దానిని తుపాకీలాంటి తన వేళ్ళలో బుల్లెట్టు తరహాలో లోడ్ చేసి.. ఆ కుర్ర హీరో రోషన్ అబ్దుల్ పైకి పేల్చింది. ఇంకేముంది.. ఆ కుర్రాడే కాదు.. చాలామంది ఇప్పుడు ఆ తుపాకీ నుండి వచ్చిన తూటా దెబ్బకి గింగిరాలు తిరిగి మైకంలో పడ్డారు. మరోసారి ఇంటర్నెట్లో ఈ టీజర్ వైరల్ అయిపోతోంది.

ఒమార్ లులు దర్వకత్వంలో రూపొందిన ఈ సినిమాకు ఇప్పుడు ప్రమోషన్లతో పెద్దగా పనిలేదేమో. ఈ సెన్సేషల్ పిల్ల కారణంగా అన్ని బాషల్లోనూ సినిమాను డబ్బింగ్ చేసి రిలీజ్ చేసినా.. బాహుబలి రేంజ్ ఓపెనింగులు వచ్చేలా ఉన్నాయి.