Begin typing your search above and press return to search.

టెంపర్ రీమేక్ లో వారియర్ బ్యూటీ

By:  Tupaki Desk   |   11 March 2018 7:16 AM GMT
టెంపర్ రీమేక్ లో వారియర్ బ్యూటీ
X
తాను ఏడాది దాకా సినిమాలు చేయను మొర్రో అని ఇంటర్నెట్ సెన్సేషన్ ప్రియా ప్రకాష్ వారియర్ నెత్తి నోరు బాదుకుంటున్నా ఇండస్ట్రీ మాత్రం అప్పటి దాక వెయిట్ చేయించేలా లేదు. నువ్వు రావాల్సిందే అని టెంప్ట్ చేసే ఆఫర్స్ తో తనను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. ఈ ముందువరసలో కరణ్ జోహార్ ముందున్నాడట. జూనియర్ ఎన్టీఆర్ సూపర్ హిట్ మూవీ టెంపర్ ను హిందిలో సింబ పేరుతో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. రన్వీర్ సింగ్ హీరోగా నటిస్తున్న దీని షూటింగ్ త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది. హీరొయిన్ గా ఎవరిని తీసుకోవాలనే తీవ్ర తర్జన భర్జనలు చేసిన మీదట ప్రియా ప్రకాష్ వారియర్ అయితే ఎలా ఉంటుంది అనే ఆలోచన వచ్చింది కరణ్ జోహార్ కు. ఆలస్యం చేయకుండా వెంటనే తన వద్దకు ప్రపోజల్ తీసుకెళ్లాడట.

ఇక్కడే చిక్కు వచ్చి పడింది. మొదటి సినిమా ఒరు ఆదార్ లవ్ విడుదల అయ్యే వరకు వేరే సినిమా చేయనని ఒప్పందం చేసుకున్న ప్రియా వారియార్ అదే మాట మీద ఇప్పటి దాకా కట్టుబడి ఉంది. కానీ ఇప్పుడు వచ్చిన ఆఫర్ తన అభిమాన కథానాయకుడు రన్వీర్ సింగ్ సినిమాలోది కావడంతో నో అని చెప్పడం ఇష్టం లేక కిందామీద పడుతోందట. మరోవైపు కరణ్ జోహార్ ఒరు ఆదార్ లవ్ మేకర్స్ ని కన్విన్స్ చేసే పనిలో ఉన్నాడని మరో టాక్ కూడా ఉంది. ఇది ఒక కొలిక్కి వస్తే టెంపర్ లో కాజల్ చేసిన పాత్రలో ప్రియా వారియర్ ను హిందీలో చూడొచ్చు. కాని డిగ్రీ ఫస్ట్ ఇయర్ లోనే ఉన్న ప్రియా ఇది ఓకే చేయాలి అంటే చదువు మానేయాలి.

రోహిత్ శెట్టి దర్శకత్వంలో రాబోతున్న ఈ రీమేక్ కోసం ఒరిజినల్ లో లేని చాలా మార్పులు చేసారట. కామెడీ టచ్ ఎక్కువగా ఉండేలా ఫస్ట్ హాఫ్ ని మార్చినట్టు తెలిసింది. క్లైమాక్స్ లో అజయ్ దేవగన్ క్యామియోతో సింబకు మరో ఆకర్షణ జత చేస్తున్నారు. టెంపర్ విడుదలైన సమయంలో అభిషేక్ బచ్చన్ తో ఇది రీమేక్ చేయాలనుకుని అంత హై వోల్టేజ్ యాక్షన్ తన వల్ల కాదని డ్రాప్ అయిన సంగతి తెలిసిందే. రన్వీర్ సింగ్ మాత్రం ఛాలెంజ్ కు సై అన్నాడు.