Begin typing your search above and press return to search.

సెన్సేషనల్ పిల్ల సెక్సీ లుక్ చూశారా

By:  Tupaki Desk   |   12 April 2018 5:07 PM GMT
సెన్సేషనల్ పిల్ల సెక్సీ లుక్ చూశారా
X
కళ్లతో రొమాన్స్ అంటే ఎంటో చూపించిన మలయాళీ పిల్ల ప్రియా ప్రకాష్ వారియర్ ఎంతగా పాపులర్ అయ్యిందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. వాట్సాప్ ఫెస్ బుక్ లకు ఆ మధ్య రెస్ట్ లేకుండా చేసిన అమ్మడు ఈ మధ్య కనిపించడం లేదేంటబ్బా అనుకుంటున్న తరుణంలో ఒక సరికొత్త లుక్ తో దర్శనం ఇచ్చింది. ఓరు ఆధార్ లవ్ ప్రోమోలలో స్టూడెంట్ డ్రెస్ లో సింపుల్ గా కనిపించినపుడే ఆమె అందానికి చాలా మంది కుర్రకారు ఫిదా అయిపోయారు. అలాంటిది మోడ్రన్ డ్రెస్ వేస్తే వారి పరిస్థితి ఏంటి?

ఇప్పుడు ఫొటోలో కనిపిస్తోన్న అమ్మడు ప్రియ వారియర్ అంటే కొంచెం నమ్మడానికి కష్టంగానే ఉంది. కానీ చాలా సెక్సీగా ఉందని చెప్పవచ్చు. మెరిసెటి ఫ్యాషన్ డ్రెస్ లో అమ్మడి అందం చాలా పెరిగింది. ఆమె చూపించిన హావభావాలు మరింత మత్తెక్కిస్తున్నాయి. పైగా లెగ్స్ అందాల గురించి ఎన్ని పాజిటివ్ కవితలు రచించినా సరిపోవు అనే విధంగా నెటీజన్స్ వారి అభిప్రాయాన్ని చెబుతున్నారు. ఇంతకుముందు ప్రియా వారియర్ ఈ రేంజ్ లో కనిపించకపోవడంతో ఆ ఫొటో షూట్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇక ప్రస్తుతం ఆమె చేస్తోన్న ఓరు ఆధార్ లవ్ సినిమాను రీ షూట్ చేస్తున్నారు. అందుకోసం మరో రెండు నెలలు ఎక్కువ సమయాన్ని తీసుకున్నారు. ప్రియా వారియర్ ప్రకాష్ పాత్ర నిడివిని దాదాపు 40 నిమిషాల వరకు పెంచనున్నారు. మరి ఆ రొమాంటిక్ పిల్ల సినిమాలో ఎంత వరకు ఆకట్టుకుంటుందో చూడాలి.