Begin typing your search above and press return to search.

ప్రియా వారియర్ జోరు పెరిగేట్టు లేదే!

By:  Tupaki Desk   |   8 Jun 2021 3:30 AM GMT
ప్రియా వారియర్ జోరు పెరిగేట్టు లేదే!
X
'ఒరు ఆదార్ లవ్' అనే మలయాళం సినిమాలో ఒకే ఒక కన్నుగీటుతో ప్రియా వారియర్ కుర్రాళ్ల మనసులను పొలోమని దోచేసింది. ఈ అమ్మాయి ఒకసారి మాత్రమే కన్నుగీటి ఉంటుందిగానీ .. ఆ వీడియోని అదే పనిగా చూసేసి చాలా మంది పిలగాళ్లకి సైట్ వచ్చేసి ఉంటుంది. ఇక ఈ పిల ఏ ఇండస్ట్రీలో అడుగుపెడితే ఆ ఇండస్ట్రీని దున్నేయడం ఖాయమని అంతా అనుకున్నారు. అయితే ఆ మలయాళం సినిమా పరాజయంపాలు కావడంతో, ప్రస్తుతం ఈ అమ్మాయి నిలదొక్కుకోవడానికే నానా తంటాలు పడుతోంది.

ఇటీవల నితిన్ హీరోగా చేసిన 'చెక్' సినిమాలో ఈ సుందరి మెరిసింది. ఈ సినిమాలో ఆమె ఒక రేంజ్ లో రెచ్చిపోయి ఉంటుందని అనుకున్నారు. ఏదేదో ఊహించుకుంటూ ఉత్సాహంగా థియేటర్లకు వెళ్లినవారు ఉసూరుమనుకుంటూ తిరిగొచ్చారు. అంతలా ఈ అమ్మాయి వారిని నిరాశపరిచింది. ఇక ఇప్పుడు ఈ పిల్ల చేతిలో 'ఇష్క్' సినిమా ఒకటే ఉంది. తేజ సజ్జా హీరోగా నటించిన ఈ సినిమా, ఇప్పటికే విడుదల కావలసింది. కానీ కరోనా కారణంగా వాయిదాపడింది.

ఈ సినిమా తరువాత తెలుగులో ఆమె ఒప్పుకున్న ప్రాజెక్టులైతే కనిపించడం లేదు. ఫలానా సినిమా కోసం ఆమెను సంప్రదిస్తున్నారనే వార్తలు కూడా వినిపించడం లేదు. చూస్తుంటే ఇక్కడ జోరు పెంచాలనుకున్న ప్రియా వారియర్ ప్రయత్నాలు ఆశించిన స్థాయిలో ఫలించేలా కనిపించడం లేదనే చెప్పాలి. ప్రస్తుతానికి ఆమె చేతిలో ఒక హిందీ .. ఒక కన్నడ సినిమాలు మాత్రమే ఉన్నాయి. మరి అదృష్టం కలిసొచ్చి ఈ అమ్మడు బిజీ అవుతుందేమో చూడాలి.