Begin typing your search above and press return to search.

వింక్ గర్ల్ వారియర్ కు సుప్రీంలో ఊరట

By:  Tupaki Desk   |   31 Aug 2018 5:48 PM IST
వింక్ గర్ల్ వారియర్ కు సుప్రీంలో ఊరట
X
మలయాళ హీరోయిన్ ప్రియ వారియర్ పేరు తెలియని సోషల్ మీడియా జనాలు దాదాపుగా ఉండరు. 'ఒరు ఆదార్ లవ్' అనే మలయాళం సినిమాలో మాణిక్య మలరాయ పూవి అనే పాటకు సంబంధించిన 28 సెకండ్ల క్లిప్ లో వారియర్ కన్నుగీటడం దేశవ్యాప్తంగా పెద్ద సెన్సేషన్ అయింది. ఆ పాట ప్రియ వారియర్ కు దేశవ్యాప్తంగా గుర్తింపు తీసుకురావడమే కాకుండా సోషల్ మీడియా స్టార్ ను చేసింది.

అదే పాట మరోవైపు వివాదాల్లో చిక్కుకుంది కూడా. ఆ పాట తమ మతాన్ని కించపరిచేలా ఉందని హైదరాబాద్ కు చెందిన కొంతమంది అభ్యంతరం లేవనెత్తారు. వారు ప్రియా వారియర్ పై ఎఫ్ ఐ ఆర్ కూడా ఫైల్ చెయ్యగా అది సుప్రీమ్ కోర్టులో విచారణకు వచ్చింది. సెక్షన్ 295(A) ప్రకారం ఎటువంటి అఫెన్స్ చేయలేదని నిర్థారించిన సుప్రీం ప్రియా వారియర్ కు కేసను కొట్టేసింది. అంతే కాదు కంప్లైంట్ చేసిన వారి ని ఉద్దేశించి "ఎవరో ఒక సినిమాలో పాట పాడితే మీకు వేరే ఏ పని లేదన్నట్టు కేసు ఫైల్ చేస్తారా?" అంటూ ఛీఫ్ జస్టిక్ దీపక్ మిశ్రా ప్రశ్నించారు.

మాణిక్య మలరాయ పూవి పాట ఫిబ్రవరి 9 న రిలీజ్ కాగా దాని తర్వాత రెండు వారాలకు ప్రియపై కేసులు నమోదయ్యాయి. ఇన్ని నెలల తర్వాత ఆమె కు ఇప్పుడు ఆ కేసుల నుండి ఊరట లభించింది.