Begin typing your search above and press return to search.

ఫొటోటాక్ : మల్లెచెండుతో రొమాంటిక్‌ వింక్‌ బ్యూటీ

By:  Tupaki Desk   |   23 Aug 2021 7:30 AM GMT
ఫొటోటాక్ : మల్లెచెండుతో రొమాంటిక్‌ వింక్‌ బ్యూటీ
X
వింక్‌ బ్యూటీ ప్రియా ప్రకాష్‌ వారియర్‌ హీరోయిన్‌ గా ఇప్పటి వరకు సరైన బ్రేక్‌ దక్కించుకోలేక పోయింది. అయినా కూడా ఆమె సోషల్ మీడియాలో చేస్తున్న సందడి అంతా ఇంతా కాదు. ఆమె సోషల్‌ మీడియాలో రెగ్యులర్‌ డైలీ లైఫ్‌ ఫొటోలతో పాటు హాట్ ఫొటో షూట్‌ ఇంకా కాన్సెప్ట్‌ బేస్డ్‌ ఫొటో షూట్‌ లను రెగ్యలర్ గా షేర్‌ చేస్తూనే ఉంటుంది. తాజాగా ఈ అమ్మడు షేర్‌ చేసిన ఈ ఫొటో షూట్ అన్ని వర్గాల వారిని ఆకట్టుకునే విధంగా ఉన్నాయి.

కేరళ స్టైల్‌ డ్రస్ లో ఈ అమ్మడు క్లీవేజ్‌ షో చేస్తూ రొమాంటిక్‌ గా మల్లె పూల చెండుతో ఫొటోలకు ఫోజులు ఇచ్చి కవ్విస్తూ ఉంది. అందరిని కూడా ఆకట్టుకుంటున్న ఈ అమ్మడి రొమాంటిక్‌ ఫోజ్ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. తెల్లటి డ్రస్‌ లో రొమాంటిక్ ఫోజ్ లు ఇస్తూ పూలను పట్టుకుని అలా అలా ఆడుతూ ఆకట్టుకున్న ప్రియా ప్రకాష్‌ వారియర్‌ చాలా రొమాంటిక్ గా ఉందంటూ నెటిజన్స్ పెద్ద ఎత్తున కామెంట్స్ చేస్తున్నారు. ఎప్పటిలాగే సోషల్‌ మీడియాలో ఈ అమ్మడు మరోసారి సందడి చేసేసింది.

తెలుగు లో ఇష్క్‌ సినిమా తో ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ అమ్మడు కమర్షియల్‌ సక్సెస్ ను దక్కించుకోలేక పోయింది. అయినా కూడా ఈమెకు తెలుగు నుండి చిన్నా మీడియం రేంజ్ సినిమాల్లో ఆఫర్లు వస్తూనే ఉన్నాయి. ఇతర భాషల్లో కూడా ఈ అమ్మడు కంటిన్యూస్ గా సినిమాలు చేస్తూనే ఉంది. ముందు ముందు అయినా ఈ అమ్మడు మంచి సినిమాలతో అలరిస్తుందేమో చూడాలి. లేదంటే ఇలా సోషల్‌ మీడియా సెన్షేషన్‌ గానే ఈమె నిలిచి పోతుందా అనేది కూడా ఆసక్తికర విషయం.