Begin typing your search above and press return to search.
కన్నుకొట్టే ఐడియా నాదేనన్న హీరోయిన్.. అంత లేదన్న దర్శకుడు
By: Tupaki Desk | 7 Jun 2023 8:00 PMప్రియా ప్రకాష్ వారియర్.. ఈ అమ్మాయి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు అనుకుంటాం. ఒక ఏడాది పాటు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా ఈమె కన్ను కొట్టే వీడియోలు మరియు ముద్దు గన్ను కాల్చే వీడియోలు తెగ వైరల్ అయ్యాయి. గడచిన దశాబ్ద కాలంలో అత్యంత ఎక్కువగా వైరల్ అయిన విజువల్స్ ఆ రెండే అనడంలో సందేహం లేదు.
2019 సంవత్సరంలో విడుదల అయిన ఓరు ఆదార్ లవ్ సినిమా కోసం ప్రియా ప్రకాష్ వారియర్ కన్ను గీటి.. ముద్దు గన్ను పేల్చిన విషయం తెల్సిందే. ఆ సినిమా తో జాతీయ స్థాయిలో పాపులారిటీని సొంతం చేసుకున్న ముద్దుగుమ్మ ప్రియా ప్రకాష్ వారియర్ ఆ సినిమాతో మరియు ఆ తర్వాత చేసిన సినిమాలతో సక్సెస్ లను దక్కించుకోలేక పోయింది.
అయినా కూడా ఇంకా వింక్ బ్యూటీ గా.. వైరల్ వింక్ ముద్దుగుమ్మగా ఈ అమ్మడు సోషల్ మీడియాలో సందడి చేస్తూనే ఉంది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ప్రియా ప్రకాష్ వారియర్ పాల్గొంది. మమతా మోహన్ దాస్ తో కలిసి ప్రియా ప్రకాష్ వారియర్ ఒక కార్యక్రమంలో భాగంగా ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. ఆ సందర్భంగా ప్రియా చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం అయ్యాయి.
ప్రియా మాట్లాడుతూ.. కన్ను గీటే ఐడియా తనదే అని... సినిమా షూటింగ్ సమయంలో తాను ఐడియా ఇవ్వడం వల్లే ఆ షాట్ ను దర్శకుడు పెట్టారు అంటూ చెప్పుకొచ్చింది. ఆ వీడియో కాస్త వైరల్ అవ్వడంతో సినిమాకు మంచి బజ్ క్రియేట్ అయ్యిందని ప్రియా ప్రకాష్ వారియర్ పేర్కొంది.
ప్రియా ప్రకాష్ వారియర్ మాటలను దర్శకుడు ఓమర్ లూలూ తప్పుబట్టాడు. అంత లేదు అన్నట్లుగా కౌంటర్ ఇచ్చాడు. పాపం పిచ్చి పిల్ల... ఐదేళ్ల క్రితం జరిగిన విషయాలను మర్చిపోయినట్లుంది. వలియ చందనాది అనే ఈ తైలం జ్ఞాపకశక్తిని మెరుగు పరచడానికి ఉపయోగపడుతుంది అంటూ కౌంటర్ ఇచ్చాడు.
అంతే కాకుండా గతంలో ప్రియా ప్రకాష్ వారియర్ మాట్లాడిన ఒక వీడియోను కూడా దర్శకుడు ఓమర్ సోషల్ మీడియా ద్వారా షేర్ చేయడం జరిగింది. ఆ వీడియోలో ఈ ఐడియా హీరో రోషన్ ది అన్నట్లుగా మాట్లాడింది. మొత్తానికి ప్రియా ప్రకాష్ వారియర్ దాని గురించి రకరకాలుగా మాట్లాడటం విడ్డూరంగా ఉందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇంతకు ఈ ఐడియా ఎవరిదో అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.