Begin typing your search above and press return to search.

సుప్రీం మెట్లెక్కేసిన ఓవర్నైట్ సెన్సేషన్

By:  Tupaki Desk   |   20 Feb 2018 4:26 AM GMT
సుప్రీం మెట్లెక్కేసిన ఓవర్నైట్ సెన్సేషన్
X
తమకు వచ్చిన గుర్తింపును పదిలపరచుకోవాలని ప్రతీ ఒక్కరూ కోరుకుంటారు. ముఖ్యంగా యాక్టర్స్ కు ఈ తపన ఇంకా ఎక్కువగా కనిపిస్తుంది. ఇక కొత్త నటీనటులు అయితే.. ఎలాగైనా ఆడియన్స్ దృష్టి తమ వైపునకు తిప్పుకునేందుకు తెగ కష్టపడుతుంటారు.

కానీ ఇలాంటవేమీ చేయకుండానే ఒక్క కనురెప్పను సరసంగా వాల్చి.. కన్ను గీటి జనాల గుండెను మీటేసింది ప్రియా ప్రకాష్ వారియర్. ఈ చిన్నది నటించిన ఒరు అడార్ లవ్ మూవీ రిలీజ్ కి ఇంకా రెండు వారాల సమయం ఉంది. ఈలోగానే ఈ భామకు పేరు తెచ్చిన పాట వివాదంగా మారడం.. ప్రియతో పాటు ఆ సినిమా దర్శకుడి పేరు కూడా కేసులో ఇరుక్కోవడం జరిగిపోయాయి. కానీ ఈ కేసులను కూడా తనకు అనుకూలంగా వాడేసుకుంటోంది ప్రియ.

తెలంగాణతో పాటు.. మహరాష్ట్రలో కూడా తమ మనోభావాలను కించపరిచేలా ఈ పాట ఉందంటూ.. ప్రియపై కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల్లో తనపై ఎలాంట క్రిమినల్ చర్యలు తీసుకోకుండా చూడాలంటూ.. ఏకంగా సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది ప్రియా ప్రకాష్. ఆ లిరిక్ కి తనకు సంబంధం లేదని.. తీసిన వ్యక్తి.. రూపొందించిన వ్యక్తి వేరని కోర్టుకు విన్నవిస్తే చాలు. కానీ సుప్రీం గడప తొక్కేసి.. మళ్లీ ఎంచక్కా వార్తల్లోకి వచ్చేసిన ప్రియ తెలివితేటలు సూపర్ అనాల్సిందే.