Begin typing your search above and press return to search.

వేధింపులు ఉన్నాయ‌ని చెప్పేసిన మ‌రో న‌టి!

By:  Tupaki Desk   |   26 Aug 2018 6:44 AM GMT
వేధింపులు ఉన్నాయ‌ని చెప్పేసిన మ‌రో న‌టి!
X
సినిమా ఇండ‌స్ట్రీలో లైంగిక వేధింపులు ఉన్నాయ‌న్న విష‌యంపై కొంద‌రు న‌టీమ‌ణులు నోరు విప్పుతున్న వైనం తెలిసిందే. రీసెంట్ గా ఆర్ ఎక్స్ 100 భామ సంచ‌ల‌న విష‌యాల్ని బ‌య‌ట‌పెట్టారు. త‌న మొద‌టిసినిమాలో బోల్డ్ గా న‌టించిన పాత్ర ప్ర‌భావ‌మేమో కానీ.. త‌మ‌తో క‌మిట్ అయితే సినిమా ఛాన్స్ ఇస్తామ‌ని చెప్పార‌ని.. ఆ విష‌యాన్ని మీడియాలో రాయాల‌ని మ‌రీ చెప్పిన ఆమె తీరు ఇప్పుడు సంచ‌ల‌నంగా మారింది.

ఇదిలా ఉంటే.. సినిమా ఇండ‌స్ట్రీలో లైంగిక వేధింపుల మాట నిజ‌మేన‌న్న విషయాన్ని కోలీవుడ్ కు చెందిన బుల్లితెర న‌టి క‌మ్ వెండితెర న‌టి ప్రియా భ‌వానీ శంక‌ర్ వెల్ల‌డించారు. ప్ర‌స్తుతం కోలీవుడ్ లో బిజీబిజీగా ఉన్న ఆమె తాజాగా ఒక కార్య‌క్ర‌మంలో పాల్గొన్న సంద‌ర్భంగా ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు.

సినిమా ఇండ‌స్ట్రీలో లైంగిక వేధింపులు ఉన్నాయ‌ని చెప్పారు. హీరోయిన్ల‌కు లైంగిక వేధింపులు ఉన్న విష‌యాన్ని కొట్టి పారేయ‌లేమ‌న్నారు. ఇలాంటి వేధింపులు అన్ని రంగాల్లోనూ ఉంటాయ‌న్నారు. ఇలాంటి వాటికి అంగీక‌రిస్తామా? నిరాక‌రిస్తామా? అన్న‌ది స‌ద‌రు వ్య‌క్తుల చేతుల్లోనే ఉంటుంద‌ని చెప్పిన ఆమె.. న‌టి శ్రీ‌రెడ్డి ఓపెన్ గా మాట్లాడ‌టం స‌రికాద‌న్న వ్యాఖ్య చేశారు.

లైంగిక వేధింపుల బారిన ప‌డ‌కూడ‌ద‌నుకుంటే న‌టన‌ నుంచి త‌ప్పుకోవ‌చ్చు క‌దా? అని ప్ర‌శ్నిస్తున్న ఆమె.. శ్రీ‌రెడ్డి అలా ఓపెన్ గా చెప్ప‌టం స‌రికాద‌న్నారు. ప్రియ మాట‌ల‌కు ఫైర్ బ్రాండ్ శ్రీ‌రెడ్డి ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.