Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: లోటు లేదు.. హద్దు లేదు

By:  Tupaki Desk   |   5 Dec 2017 8:06 AM GMT
ఫోటో స్టోరి: లోటు లేదు.. హద్దు లేదు
X
ఆడదాని ఓరచూపులు.. జగాన ఓడిపోని వీరుడెవ్వడు.. కొలనులో మెరిసిన ఎర్రకలువలా ఉన్న ఈ సుందరాంగిని చూశాక ఆ పాట గుర్తొస్తే ఎంత మాత్రమూ తప్పు కాదు. మతి పోగొట్టే అందం.. మత్తెక్కించే చూపులు.. సోగకన్నులు.. తీరైన ఒంపు సొంపులు.. ఘాటైన సొగసులున్న సుందరాంగి ఓరకంట చూస్తే ఊగిపోని వారెవరుంటారు? అందానికి లోటు లేదు.. ఆరబోతకు హద్దు లేదన్నట్లు ఫొటోలకు ఫోజులిస్తున్న ఈ సుందరాంగి పేరు ప్రియా బెనర్జీ.

భారతీయ సంతతికి చెందిన ఈ బెంగాలీ పుట్టి పెరిగింది కెనడాలో. కొత్తందాలకు పెద్దపీట వేసే టాలీవుడ్ ఆమెకు వెల్ కం చెప్పింది. తొలిసారిగా అడవి శేష్ హీరోగా నటించిన కిస్ అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది. తరవాత సందీప్ కిషన్ హీరోగా నటించిన జోరు.. నారా రోహిత్ హీరోగా వచ్చిన అసుర సినిమాలోనూ నటించింది. అవకాశాలొచ్చినా గుర్తింపు రాకపోవడంతో బాలీవుడ్ కు మకాం మార్చింది. అక్కడా ఇంతవరకు పెద్దగా ఫేమ్ లోకి రాలేదు. దీంతో తనలోని అసలు టాలెంట్ ఏంటో చూపించాలని అనుకుందో ఏమోగానీ రీసెంట్ గా ఓ మ్యాగజైన్ ఫోజులిచ్చింది. క్లీవేజ్ అందాలన్నీ బాహాటంగా బయటపెట్టేసి రెడ్ కలర్ ఇన్నర్స్ తో ఈ సెక్సీ భామ ఇచ్చిన ఫోజులు చూస్తే ఇంత అందాన్ని ఇంతకాలం పట్టించుకోలేదని సినీ జనాలంతా ఫీలయిపోవడం ఖాయం.

తాను యాక్టింగ్ పై ఇంట్రస్ట్ తో ఇండియాకొచ్చి అవకాశాలు వెతుక్కోవడం మొదలెట్టాక మొట్ట మొదట అవకాశం వచ్చింది తెలుగులోనేని.. అందువల్ల టాలీవుడ్ కు ఎప్పుడు తన మనసులో ప్రత్యేక స్థానం ఉంటుందని చెప్పుకొస్తోంది. మరి 'లోటు'లేని అందంతో.. 'హద్దు'లేని ఆరబోత చేసిన ఈ భామను పట్టించుకుంటారా?