Begin typing your search above and press return to search.

కిస్‌ బ్యూటీ.. హిందీలో బిజి బిజీ

By:  Tupaki Desk   |   2 Dec 2015 9:30 AM GMT
కిస్‌ బ్యూటీ.. హిందీలో బిజి బిజీ
X
'పంజా'లో యంగ్ విల‌న్, `బాహుబ‌లి`లో భ‌ళ్లాల దేవుని కొడుకు .. గుర్తున్నాడా? అంత తేలిగ్గా మ‌ర్చిపోగ‌ల‌మా? ఏ జానూ.. క‌సిగా ఉన్నావే.. అంటూ పంజాలో అద‌ర‌గొట్టే పెర్ఫామెన్స్ చేశాడు అడివి శేష్‌. ఆ త‌ర్వాత బాహుబ‌లిలో శివుడిని వెంట‌ప‌డి త‌రిమే రాకుమారిడిగా క‌నిపించి ఆక‌ట్టుకున్నాడు. అయితే ఈ రెండు సినిమాల్లోనూ ఆర్థాంత‌రంగానే హ‌త‌మ‌వుతాడు. ఏదేమైనా ప్రేక్ష‌కుల మైండ్‌ లో ఓ ముద్ర అంటూ వేశాడు అడివి శేష్‌.

అయితే ఈ హీరో ఓ ఎన్నారై, క‌ర్మ సినిమాతో హీరోగా, ద‌ర్శ‌కుడిగా టాలీవుడ్‌ కి ప‌రిచ‌య‌మై విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకున్నాడు. అటుపై కిస్‌ అనే టైటిల్‌ తో హీరోగా మ‌రో ఎటెంప్ట్ చేశాడు. అస‌లు అడివి శేష్ గురించి ఇంత ఇంట్ర‌డ‌క్ష‌న్ ఎందుకు ఇవ్వాల్సొచ్చింది అంటే అత‌గాడు త‌న రెండు సినిమాల‌తో ఇద్ద‌రు అంద‌గ‌త్తెలైన క‌థానాయిక‌ల్ని ఇంట్ర‌డ్యూస్ చేశాడు. `కిస్‌` మూవీతో విదేశీ అంద‌గ‌త్తె ప్రియా బెన‌ర్జీని తెలుగు తెర‌కి ప‌రిచ‌యం చేశాడు. ఈ మూవీ ఫ్లాపైంది కానీ ఈ అమ్మ‌డు త‌న సొగ‌స‌రి త‌నానికి దూసుకుపోయేదే. ఆ సినిమా త‌ర్వాత మ‌రో సినిమాలో న‌టించినా పెద్ద‌గా కెరీర్ వెల‌గ‌లేదిక్క‌డ‌. దాంతో ఇప్పుడు బాలీవుడ్ వెళ్లిపోయింది. అక్క‌డ వ‌రుస‌గా మూడు భారీ ప్రాజెక్టుల్లో న‌టిస్తోంది. 3 దేవ్ అనే టైటిల్ తో తెర‌కెక్క‌నున్న‌ మూవీ లో న‌టిస్తోంది. అలాగే ప్ర‌ఖ్యాత టి-సిరీస్ నిర్మించే సినిమాకి సంత‌కం చేసింది. దీంతో పాటే మ‌రో పెద్దనిర్మాణ సంస్థ నుంచి ఆఫ‌ర్ వ‌చ్చింది. అయితే ఇన్ని ఉన్నా టాలీవుడ్ ని ఎప్ప‌టికీ మ‌ర్చిపోన‌ని చెబుతోంది అమ్మ‌డు.

ఇప్ప‌టికి బాలీవుడ్‌ లో న‌టిస్తున్నా వ‌చ్చే ఏడాది టాలీవుడ్‌ కి తిరిగి వ‌స్తాను.. అని చెప్పింది. అందం ఉంది. ఒగ‌రు ఉంది. కానీ తెలుగులో ఛాన్సులిచ్చేవాళ్లే లేరు మ‌రి! అందుకే పోగొట్టుకున్న చోట రాబ‌ట్టుకోవాల‌న్న ప్ర‌య‌త్నంలో ఉంద‌మ్మ‌డు. ఆల్ ది బెస్ట్ ప్రియా!