Begin typing your search above and press return to search.
రకుల్ ప్రీత్ కోసం ప్రైవేట్ ఛాపర్!
By: Tupaki Desk | 18 Dec 2021 11:48 AM ISTటాలీవుడ్ లో ఒకానొక సమయంలో స్టార్ హీరోయిన్ గా వెలుగు వెలిగి అందరిని తన వెంట తిప్పుకున్న ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ సింగ్. ఆ సమయంలో టాలీవుడ్ లో స్టార్ హీరోల అందరితో కూడా సినిమాలు చేసేసింది. ఒకానొక సమయంలో మహేష్ బాబు వంటి స్టార్ కు కూడా డేట్లు ఇవ్వలేక ఆయన సినిమాను వదులుకుంది. ఆ తర్వాత మళ్లీ ఆయనతో సినిమా చేసే అవకాశం దక్కించుకుంది.
అంతటి ఫేమస్ అయిన హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ టాలీవుడ్ లో ఈమద్య కాలంలో చిన్నా చితకా సినిమాలతో కెరీర్ ను నెట్టుకు వస్తుంది. కంటెంట్ బేస్డ్ సినిమాలను కూడా చేసేందుకు ఈ అమ్మడు సిద్దంగా ఉంది. లేడీ ఓరియంటెడ్ చిత్రాలను చేయాలనుకుంటున్న ఈ అమ్మడు ముందు ముందు మరిన్ని తెలుగు సినిమాలను చేసేందుకు ప్రయత్నాలు చేస్తుంది.
ఇదే సమయంలో ఈమె హిందీలో కూడా సినిమాలు చేసేందుకు ఆసక్తిగా ఉంది. ప్రస్తుతం ఈమె హిందీలో రెండు మూడు సినిమాలు చేస్తూనే మరి కొన్ని సినిమాలకు కమిట్ అయ్యింది. ఈ అమ్మడు హిందీలో ప్రస్తుతం చేస్తున్న సినిమా కోసం ఏకంగా ఈమెకు ప్రత్యేకంగా ఛాపర్ ను ఏర్పాటు చేయడం జరిగింది. ఆ షూటింగ్ కోసం రకుల్ ప్రైవేట్ ఛాపర్ లో వెళ్లడం సోషల్ మీడియాలో చర్చ నీయాంశం అయ్యింది.
అసలు విషయానికి వస్తే.. రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం బాలీవుడ్ లో చత్రీవాలీ సినిమా లో నటిస్తోంది. ఆ సినిమాకు సంబంధించిన షూటింగ్ పుణె లో జరుగుతోంది. అయితే అంతకు ముందు ముంబయిలో రకుల్ ప్రీత్ సింగ్ వేరే షూటింగ్ లో ఉంది. ఉదయం ముంబయిలో షూటింగ్ ముగించుకుని మద్యాహ్నాంకు పుణె కు రకుల్ ప్రీత్ సింగ్ చేరుకోవాల్సి వచ్చింది. పుణె కు విమానాలు ఉన్నా కూడా ఆ సమయం తో సెట్ అవ్వదనే ఉద్దేశ్యంతో షూటింగ్ ఆలస్యం కాకుడదని చత్రీవాలీ టీమ్ ప్రైవేట్ ఛాపర్ ను రకుల్ ప్రీత్ సింగ్ కోసం బుక్ చేయించి ముంబయి నుండి పుణె కు రప్పించారని తెలుస్తోంది.
రకుల్ ప్రీత్ సింగ్ షూటింగ్ కు ఆలస్యం అయితే పలువురు నటీ నటుల డేట్లు వృదా అవ్వడం తో పాటు చాలా టెక్నికల్ క్రూ కూడా ఖాళీగా కూర్చోవాల్సి వస్తుందట. అందుకే కాస్త ఖర్చు ఎక్కువ అయినా కూడా ప్రత్యేక ఛాపర్ లో ఆమెను రప్పించారనే వార్తలు వస్తున్నాయి. మీడియాలో ఈ విషయమై చర్చ జరుగుతోంది. రకుల్ క్రేజ్ బాలీవుడ్ లో మామూలుగా లేదుగా అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
తెలుగు సినిమాల విషయానికి వస్తే ఈమె కొండ పొలం సినిమా తో ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కొండ పొలం సినిమా లో వైష్ణవ్ తేజ్ కు జోడీగా ఈమె నటించింది. భారీ అంచనాల నడుమ రూపొందిన కొండ పొలం సినిమా కమర్షియల్ గా నిరాశ పర్చింది. అయినా కూడా రకుల్ ప్రీత్ కు నటిగా ఆ సినిమా మంచి గుర్తింపును తెచ్చి పెట్టింది అనడంలో సందేహం లేదు. భారీ అంచనాల నడుమ తమిళంలో రూపొందుతున్న ఒక సినిమా లో ఈమె కీలక పాత్రలో నటిస్తోంది.
తెలుగు లో కూడా ఈమె ఒకటి రెండు సినిమాలు చేస్తూ ఉంది. వాటికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వచ్చే అకవాశం ఉంది. రకుల్ ప్రీత్ సింగ్ మళ్లీ టాలీవుడ్ లో కూడా స్టార్ హీరోలకు మోస్ట్ వాంటెడ్ గా మారడం ఖాయం అనే నమ్మకంను ఇండస్ట్రీ వర్గాల వారు వ్యక్తం చేస్తున్నారు. రకుల్ ప్రీత్ సింగ్ ను ఇప్పటికి కూడా అభిమానులు పెద్ద ఎత్తున అభిమానిస్తూనే ఉన్నారు. ఆమె సోషల్ మీడియాను అభిమానులు మిలియన్స్ కొద్ది ఫాలో అవుతున్నారు.