Begin typing your search above and press return to search.

క్వారంటైన్ పూర్తి చేసుకుని భావోద్వేగానికి గురైన హీరో

By:  Tupaki Desk   |   6 Jun 2020 1:20 PM IST
క్వారంటైన్ పూర్తి చేసుకుని భావోద్వేగానికి గురైన హీరో
X
సినిమా షూటింగ్ కోసం విదేశాల‌కు వెళ్ల‌గా వైర‌స్ తీవ్ర రూపం దాల్చ‌డంతో అన్ని దేశాల్లో లాక్‌డౌన్ విధించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న విదేశంలోనే చిక్కుకున్నాడు. స్వ‌దేశానికి రాలేక‌.. అక్క‌డ ఉండ‌లేక తీవ్ర ఇబ్బందులు ప‌డ్డాడు. దీంతో రెండు నెల‌ల పాటు విదేశాల్లో ఉండ‌గా.. లాక్‌డౌన్ ఆంక్ష‌లు స‌డ‌లించ‌డంతో స్వ‌దేశానికి రాగా ఇక్క‌డ‌కు వ‌చ్చినా కూడా కుటుంబానికి దూర‌మ‌య్యాడు. ఆయ‌న క్వారంటైన్‌ లో 14 రోజుల పాటు ఉండి పోయాడు. ఇన్నాళ్టికి ఇంటికి చేరుకుని భార్య‌, పాప‌ను చూడ‌గానే భావోద్వేగానికి లోన‌య్యాడు. ఈ విష‌యాన్ని త‌న సోష‌ల్ మీడియాతో పంచుకున్నాడు. అత‌డే మలయాళ సినీ నటుడు పృథ్వీరాజ్‌ సుకుమారన్.

‘ఆదుజీవితం’ సినిమా షూటింగ్ కోసం పృథ్వీరాజ్‌, దర్శకుడు బ్లెస్సీతో పాటు 58 మంది బృందంతో జోర్డాన్‌కు వెళ్లారు. అయితే అప్ప‌టికే వైర‌స్ ప్ర‌బ‌లి ప‌రిస్థితి చేయి దాటింది. స్వ‌దేశానికి వ‌ద్దామంటే అంత‌ర్జాతీయ ప్ర‌యాణాలు ఆపేశారు. దీంతో వారు అక్క‌డే చిక్కుకున్నారు. దాదాపు రెండు నెలల తర్వాత భారత ప్ర‌భుత్వం వందే భారత్‌ మిషన్ చేప‌ట్టింది. ఈ సంద‌ర్భంగా మే 22వ తేదీన ప్రత్యేక విమానంలో ఆ చిత్ర‌బృందంతో పాటు పృథ్వీరాజ్ స్వ‌దేశానికి తిరిగొచ్చారు.

కేరళకు చేరుకున్న త‌ర్వాత వారందరిని 14 రోజులపాటు క్వారంటైన్‌లో ఉంచారు. ఈ క్రమంలోనే వారంద‌రికీ వ్యాధి నిర్ధార‌ణ ప‌రీక్ష‌లు చేశారు. వారిలో పృథ్వీరాజ్‌కు నెగటివ్‌ తేలింది. దీంతో అత‌డు ఇంటికి చేరుకున్నాడు. ఇంటికెళ్లిన అనంత‌రం తన భార్య సుప్రియా మీనన్‌, కుమార్తె అలంకృతాతో దిగిన ఫొటోను శుక్రవారం త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నాడు. ‘మళ్లీ ఒకటయ్యాం’ అనే క్యాప్షన్‌తో త‌న ఫొటోను షేర్ చేశారు. ఇన్నాళ్లు కుటుంబానికి దూర‌మైన బాధ‌ను ఆయ‌న అభిమానుల‌తో పంచుకున్నారు. ఇన్ని రోజులు తన కుటుంబాన్ని మిస్‌ అయినా బాధ.. ప్రస్తుతం కుటుంబాన్ని చేరుకున్న ఆనందపు క్షణాల‌తో ఆయ‌న భావోద్వేగానికి లోన‌య్యారు.