Begin typing your search above and press return to search.

రవితేజకు కొడుతున్నాడే.. బన్నీకి కూడా

By:  Tupaki Desk   |   16 Feb 2017 11:15 AM GMT
రవితేజకు కొడుతున్నాడే.. బన్నీకి కూడా
X
దేవిశ్రీ ప్రసాద్.. తమన్.. అనూప్ రూబెన్స్ లాంటి లోకల్ మ్యూజిక్ డైరెక్టర్లతో పని చేసి మన దర్శకులకు బోర్ కొట్టేస్తున్నట్లుంది. అందుకే ఈ మధ్య పొరుగు భాషల వైపు చూస్తున్నారు. పవన్ కళ్యాణ్-త్రివిక్రమ్ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. ప్రభాస్-సుజీత్ సినిమాకు శంకర్-ఎహసాన్-లాయ్ సంగీత దర్శకులుగా ఎంపికయ్యారు. ఈ మధ్యే మొదలైన రవితేజ కొత్త సినిమా ‘టచ్ చేసి చూడు’ కోసం బాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ప్రీతమ్ ను తీసుకున్న సంగతి తెలిసిందే. ఆ సినిమాకు ప్రీతమ్ వర్క్ మొదలుపెట్టాడో లేదో కానీ.. ఇంతలోనే అతణ్ని మరో సినిమాకు బుక్ చేసేసినట్లు సమాచారం.

ప్రస్తుతం ‘దువ్వాడ జగన్నాథం’ చేస్తున్న అల్లు అర్జున్.. దీని తర్వాత రైటర్ టర్నింగ్ డైరెక్టర్ వక్కంతం వంశీతో ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ అనే సినిమాకు కమిటైన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి ప్రీతమ్ తో మ్యూజిక్ చేయించాలని డిసైడయ్యారు. ప్రీతమ్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్లు సమాచారం. హిందీ సినిమాలతో సమానంగా పారితోషకం ఆఫర్ చేస్తుండటంతో తెలుగు సినిమాలు చేయడానికి ప్రీతమ్ కు అభ్యంతరాలేమీ లేనట్లు కనిపిస్తోంది. ధూమ్ సిరీస్ తో పాటు ఎన్నెన్నో మ్యూజికల్ హిట్స్ ఇచ్చాడు ప్రీతమ్. లేటెస్టుగా దంగల్.. యే దిల్ హై ముష్కిల్ సినిమాలతో ప్రీతమ్ తనదైన ముద్ర వేశాడు. తెలుగులో మున్ముందు అతను బాగా బిజీ అయ్యేలా కనిపిస్తున్నాడు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/