Begin typing your search above and press return to search.

కండలు పెంచిన బిగ్ బాస్ బాబు

By:  Tupaki Desk   |   28 Feb 2018 11:31 AM IST
కండలు పెంచిన బిగ్ బాస్ బాబు
X
టాలీవుడ్ లోనే కాదు ఏ సినిమా పరిశ్రమలో అయినా టాలెంట్ తో పాటు ఎంతో కొంత లక్ కలిసి వస్తేనే తప్ప మనమేంటో చాటి చెప్పలేం. నటుడు ప్రిన్స్ సెసిల్ పరిస్థితి అలాగే ఉంది. పరిశ్రమకు వచ్చి ఆరేళ్ళవుతున్నా పట్టుమని పది సినిమాలు కూడా తన ఖాతాలో లేని ప్రిన్స్ ఆ మధ్య బిగ్ బాస్ షోతో పేరు తెచ్చుకున్నాడు కాని ఎక్కువ క్రెడిట్ మిగిలిన టీం మెంబెర్స్ కు వెళ్ళిపోవడంతో సహజంగానే కొంత నిరుత్సాహానికి గురయ్యాడు. కాని ఆ షో గతంలో కంటే తనకు ఎక్కువ పాపులారిటీ ఇచ్చింది అన్నది మాత్రం నిజం. మిస్టర్, నేను శైలజ లాంటి సినిమాల్లో జస్ట్ సపోర్టింగ్ రోల్స్ లో అలా అలా మెరిసిన ప్రిన్స్ అసలు టార్గెట్ హీరో కావడం. అందుకే కాబోలు కండలు పెంచి సిక్స్ ప్యాక్ కోసం ప్రత్యేకంగా జిమ్ చేస్తూ ట్రైనర్ ను కూడా ఏర్పాటు చేసుకున్నాడు.

ఇంత ఎందుకు కష్టపడుతున్నాడు అనే అనుమానం రాక మానదు. విశ్వసనీయ సమాచారం మేరకు ప్రిన్స్ హీరోగా త్వరలో ఓ సినిమా రూపొందనుంది. కథ డిమాండ్ మేరకే ప్రిన్స్ ఇలా బాడీ ఫిట్నెస్ మీద దృష్టి పెట్టి కండలు బండలుగా మార్చుకుని లుక్స్ తో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడట. మొహంలో కూడా సున్నితత్వం పోయి బాగా రఫ్ మాస్ లుక్ వచ్చేలా చేసుకోవడం వెనుక కూడా ఇదే కారణమట. కెరీర్ ప్రారంభంలో తేజ - మారుతీ లాంటి టాలెంటెడ్ దర్శకుల సినిమాల్లో హీరోగా చేసే అదృష్టం దక్కినప్పటికీ అవి కమర్షియల్ గా సక్సెస్ కాకపోవడం ప్రిన్స్ కెరీర్ కు పెద్ద బ్రేక్ వేసింది. మరి ఇప్పుడు హీరోలకు ధీటుగా పెరిగిన ప్రిన్స్ సిక్స్ ప్యాక్ బాడీ చూసాక అవకాశాలు వెల్లువెత్తుతాయి అనే అంచనాలో ఉన్నాడు.