Begin typing your search above and press return to search.

హీరోయిన్ పై దాడి.. మేడం పేరేంటంటే..

By:  Tupaki Desk   |   30 Aug 2017 12:57 PM GMT
హీరోయిన్ పై దాడి.. మేడం పేరేంటంటే..
X
తప్పు చేయడానికి చాలా సేపు ఆలోచిస్తారు. కానీ ఆ తప్పు బయటపడితే ఎంతటి మూల్యాన్ని చెల్లించుకోవాల్సి ఉంటుందో అని ఒక్క నిమిషం కూడా ఆలోచించరు. దీంతో ఎక్కడో ఉన్న జీవితం ఒక్కసారిగా ఊహించని స్థితిలోకి జారిపోతుంది. ఆవేశానికి పోయి జీవితాన్ని అల్లరిపాలు చేసుకుంటారు. ఇప్పుడు అదే పరిస్థితుల్లో ఉన్నాడు మలయాళీ హీరో దిలీప్. ఎంత కష్టపడి నటుడిగా- నిర్మాతగా మంచి పేరు తెచ్చుకున్న అతడు ఆవేశానికి స్టార్ లైఫ్ ని అతలాకుతలం చేసుకున్నాడు. హీరోయిన్ కిడ్నప్ కేసులో ఇరుక్కొని ఇప్పుడు జైల్లో జీవితాన్ని గడుపుతున్నాడు.

అసలు ఆ ఆవేశం సంగతి ఏమిటంటే.. ఫిబ్రవరి నెలలో ఒక హీరోయిన్ కారులో వెళుతుండగా ఇద్దరు దుండగులు అడ్డగించి ఆమెపై లైంగికంగా దాడి చేయించారు. అలాగే వాటిని కెమెరాల్లో బందించి ఆ హీరోయిన్ ని బ్లాక్ మెయిల్ చేయాలనుకున్నారు. కానీ బాధితురాలు పోలీసులను ఆశ్రయించడంతో అసలు సంగతి. బయటపడింది. దీని వెనుక ఉన్నది హీరో దిలీప్ అని మొదట పోలీసులు నిందితుల నుంచి కనుగొని అరెస్ట్ కూడా చేశారు. అయితే ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న పల్సర్ సుని కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలియజేశాడు. అసలు గొడవ ఎలా జరిగింది- ఎవరివల్ల జరిగిందనే దానిపై ఓ క్లారిటీ కూడా ఇచ్చేశాడు. బుధవారం అతన్ని పోలీసులు ఎర్నాకులం సెషన్స్‌ కోర్టుకు తీసుకెళ్లి విచారించగా.. నేను ఒక దొంగని..నేను ఇంకొక వ్యక్తి.. ఆ నటిని కిడ్నప్ చేశాం.. అయితే అది ఎలా చెయ్యాలో తమకు ఒక మేడమ్ వివరించిందని ఆమె పేరు కావ్య అని చెప్పడంతో అందరు షాక్ కి గురయ్యారు. కావ్య అంటే మరి దిలీప్ ప్రస్తుత భార్య కావ్య మాధవన్ అనే అందరూ అనుకుంటున్నారు.. పోలీసులతో సహా!!

అంతే కాకుండా ఓ అనుమానం కూడా బలంగా వినిపిస్తోంది. దిలీప్ మొదటి భార్య మరియు ఆ నటి మంచి స్నేహితురాలు అవ్వడం వల్ల కావ్యనే ఆవేశంతో ఈ తరహా కుట్రను పన్నిందని ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పుడు అసలు నిందితులు కూడా నిజాన్ని బయటపెట్టడంతో కావ్య అందం వెనుక ఇంత ఆవేశం ఉందా అని అందరు ఆశ్చర్యపోతున్నారు. కానీ కావ్య మాత్రం తనకు ఎలాంటి పాపం తెలియదని చెబుతోంది. తన భర్తను అన్యాయంగా ఈ కేసులో ఇరికించారని వాదిస్తోంది.