Begin typing your search above and press return to search.
నేనా.. మహేష్ బాబుతోనా!
By: Tupaki Desk | 2 Nov 2015 1:56 PM ISTతెలుగు సినిమాల్లో హీరోయిన్లకు పేరు రావడం అరుదు. ఎక్కువగా పాటలకు, గ్లామర్ షోలకు పరిమితమవుతుంటారు హీరోయిన్లు. ఐతే ప్రగ్య జైశ్వాల్ కు మాత్రం కెరీర్ ఆరంభంలోనే నటించే అవకాశం కూడా దొరికింది. ‘మిర్చి లాంటి కుర్రాడు’ లాంటి చిన్న సినిమాతో హీరోయిన్ గా పరిచయమైన ప్రగ్యకు ‘కంచె’ లాంటి పెద్ద సినిమాలో ఛాన్స్ రావడం ఆశ్చర్యం కలిగించే విషయం. అందులో అందంతో, అభినయంతో ఆకట్టుకుని మంచి మార్కులేయించుకుంది ప్రగ్య. ఈ సినిమాకు ప్రశంసలే కాదు, కలెక్షన్లు కూడా బాగానే వస్తున్నాయి. సినిమా హిట్ అనిపించుకుంది. దీంతో ప్రగ్యకు మంచి అవకాశాలే వస్తున్నట్లు సమాచారం.
ఐతే మిగతా ఛాన్సుల మాటేమో కానీ.. ప్రగ్య మహేష్ బాబు సరసన నటించబోతోందన్న వార్త కొన్ని రోజులుగా మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. మురుగదాస్ దర్శకత్వంలో ప్రిన్స్ నటించే సినిమాలో ఆమే హీరోయిన్ అంటున్నారు. ఐతే ఈ వార్తను ప్రగ్య ఖండించింది. తనకు మహేష్ సినిమాలో అవకాశం దక్కిందన్న వార్త అబద్ధమని చెప్పింది. ‘‘మహేష్ సినిమాలో నటించడం అంటే కల నెరవేరినట్లే. అలాంటి అవకాశాన్ని ఎవ్వరూ వదులుకోరు. ఐతే దురదృష్టవశాత్తూ నన్నెవరూ మహేష్ సినిమా కోసం అడగలేదు. అది నిజం కావాలని కోరుకుంటున్నా కానీ.. నాకు అలాంటి ఛాన్సేమీ రాలేదు’’ అని చెప్పింది ప్రగ్య. తాను తర్వాత చేయబోయే సినిమాల గురించి త్వరలోనే వెల్లడిస్తానని అంది ప్రగ్య. కంచె లాంటి మంచి సినిమాలో తనకు అవకాశం దక్కడం అదృష్టమని.. ఈ సినిమాను ప్రేక్షకులు ఆదరించి తమ అభిరుచి చాటుకున్నారని చెప్పింది.