Begin typing your search above and press return to search.

రుద్రమని ఆల్ మోస్ట్‌ అడ్డుకున్నట్లేనా??

By:  Tupaki Desk   |   28 Sept 2015 5:00 PM IST
రుద్రమని ఆల్ మోస్ట్‌ అడ్డుకున్నట్లేనా??
X
రుద్రమదేవి లెక్కలు ఇంకా ఏం తేలడం లేదు. ఒకసారి పోస్ట్ పోన్ అనీ, వెంటనే తూచ్ వచ్చేస్తోందని హడావిడి కామన్ అయిపోయింది. తాజాగా ఫిలిం ఛాంబర్ కి పిలిపించి మరీ క్లాస్ ఇచ్చారనే టాక్ కూడా ఉంది. అయినా సరే లొంగకుండా.. పోస్టర్స్ కూడా మొదలుపెట్టేశాడు గుణశేఖర్. అక్టోబర్ 9న రిలీజ్ ఖాయమని గట్టిగానే చెప్పాడు. అదే రోజు రుద్రమదేవి అనుష్క నటించిన సైజ్ జీరో వచ్చినా సరే.. వెనక్కు తగ్గేది లేదన్నాడు.

ఇంత మొండిగా పట్టుదల పట్టడానికి ఈయనకు చాలానే కారణాలున్నాయి. ఆర్థిక సమస్యలనుంచి గట్టెక్కడానికి గట్టిగానే అడ్వాన్సులు తీసుకుని రిలీజ్ డేట్ ఇచ్చాడు. ఇప్పుడు వెనక్కు తగ్గితే ప్రెజర్ పెరిగిపోతుంది. కానీ దసరా సీజన్ లో రాబోతున్న పెద్ద సినిమాల నిర్మాతల నుంచి.. రుద్రమను వాయిదా వేసుకోవాల్సిందిగా ఒత్తిడి వస్తోందని టాక్ వినిపిస్తోంది. అయితే.. రుద్రమ కోసం దాదాపు తనకు చెందినవన్నీ తెచ్చిపోసేశాడు గుణశేఖర్. త్రీడీ అని, ఇంకోటని క్వాలిటీ కోసం రకరకాల పేర్లతో 70 కోట్లు ఖర్చుపెట్టేశాడు. చరిత్రలో నిలిచిపోయే చారిత్రక త్రీడి చిత్రంగా రుద్రమకు రికార్డ్ దక్కుతుంది. అయితే.. యంగ్ స్టార్ హీరోల సినిమాల కోసం ఈ విషయంలో గుణ పైనే ఒత్తిడి పెరుగుతోంది. కొంచెం ఆలోచించి ఎవరైనా దారి ఇస్తే.. రుద్రమదేవి కష్టాలు తీరతాయి. కాకపోతే రుద్రమదేవి ఎట్టిపరిస్థితిల్లో 9న విడుదల కాకుండా ఇప్పటికే ట్రాప్‌ సెట్టయినట్లు టాక్‌. మనోడు కూడా డిసెంబర్‌ అయితే బెస్ట్‌ అని ఫిక్సయ్యాడట.

ఒకరకంగా చెప్పుకోవాలంటే నటవారసులైనా ఆ ఇద్దరు యంగ్ హీరోల సినిమాలు.. సీజన్ తో సంబంధం లేకుండా ఎప్పుడొచ్చినా కలెక్షన్స్ కుమ్మేయడం ఖాయం. అలాంటప్పుడు వారు ఎప్పుడొస్తే ఏంటి? ఈ సీజన్‌ ను గుణశేఖర్‌ కు వదిలేయోచ్చుగా....