Begin typing your search above and press return to search.

తెలంగాణ ఫిలింఛాంబ‌ర్ అధ్య‌క్షుడిగా నారంగ్

By:  Tupaki Desk   |   28 Aug 2021 10:09 PM IST
తెలంగాణ ఫిలింఛాంబ‌ర్ అధ్య‌క్షుడిగా నారంగ్
X
తెలంగాణ ఫిలింఛాంబ‌ర్ త‌న ఉనికిని చాటుకుంటోంది. తెలంగాణ‌కు చెందిన ప‌రిశ్ర‌మ‌ దిగ్గ‌జాల‌తో కూడుకున్న ``తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబ‌ర్ ఆఫ్ కామ‌ర్స్`` యాక్టివిటీస్ ఇటీవ‌ల మ‌రింత మెరుగ్గా ప్ర‌చారంలోకి వ‌స్తున్నాయి. ఎన్నిక‌ల‌తోనూ మ‌రింత బ‌లోపేతం అవుతోంది.

శ‌నివారం (28 ఆగ‌స్ట్‌) రోజున తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబ‌ర్ ఆఫ్ కామ‌ర్స్ 76వ జ‌న‌ర‌ల్ బాడీ మీటింగ్ జ‌రిగింది. ఈ మీటింగ్ అనంత‌రం రాబోవు రెండు సంవ‌త్స‌రాలకుగానూ( 2021-23 వ‌ర‌కు) కొన‌సాగ‌బోయే నూత‌న కార్య‌వ‌ర్గాన్ని ఎన్నుకున్నారు. సునీల్ నారంగ్ ఈసారి అధ్య‌క్షుడ‌య్యారు. ఈ కార్య‌వ‌ర్గం వివరాల్ని ప‌రిశీలిస్తే..

ప్రెసిడెంట్ - సునీల్ నారంగ్ ... వైస్ ప్రెసిడెంట్స్ - బాల‌గోవింద్ రాజ్ త‌డ్ల‌- వి.ఎల్‌.శ్రీధ‌ర్ - ఎ.ఇన్నారెడ్డి(కో అప్టెడ్‌).. కార్య‌ద‌ర్శి - కె.అనుప‌మ్ రెడ్డి.. సంయుక్త కార్య‌ద‌ర్శి - జె.చంద్ర‌శేఖ‌ర్ రావు..కోశాధికారి - ఎం.విజేంద‌ర్ రెడ్డి ఎన్నిక‌వ్వ‌గా.. ఎగ్జిక్యూటివ్ క‌మిటీ స‌భ్యులుగా బి.లింగం గౌడ్ -పి.సుబ్ర‌మ‌ణ్యం-డి.విష్ణు మూర్తి -ర‌వీంద్ర గోపాల్ -జి.శ్రీనివాస్ -బి.స‌త్య‌నారాయ‌ణ గౌడ్‌- జి.శ్రీనివాస్ రెడ్డి - చెట్ల ర‌మేశ్ -బి.విజ‌య్ కుమార్ -కె.ఉద‌య్ కుమార్ రెడ్డి- ఎం.న‌రేంద‌ర్ రెడ్డి - ఎం.మోహ‌న్ కుమార్ - కె.అశోక్ కుమార్ .. ఎన్నిక‌య్యారు.

ఏపీ- తెలంగాణ డివైడ్ అనంత‌రం తెలంగాణ క‌ళాకారుల‌కు స్థానిక ప్ర‌తిభ‌కు జ‌రుగుతున్న అన్యాయాల్ని అరిక‌డ‌తామ‌ని ప్ర‌తిజ్ఞ‌లు చేశారు. కానీ విభ‌జ‌న అనంత‌రం ఆ ఊసే లేదు. డ‌బ్బుతో న‌డిచే ప‌రిశ్ర‌మ‌లో రిక‌మండేష‌న్లు ఏవీ ఉండ‌వు. ప్ర‌తిభ‌ను చూసే ఈ రంగంలో ఎవ‌రి ప‌ప్పులూ ఉడ‌క‌వ‌ని ప్రూవైంది. ఇక ఆంధ్రా తెలంగాణ అనే విభేధాల‌ను ప‌క్క‌న బెట్టి ప్ర‌తిభ ఉంటే ఏ ప్రాంతం వారినైనా ప్రోత్స‌హిస్తామ‌ని ఈ రంగంలో వేళ్లూనుకున్న ఆ న‌లుగురు కానీ నిర్మాత‌ల గిల్డ్ ఆ ప‌ది మంది పెద్ద నిర్మాత‌లు కానీ నిరూపించారు. తెలంగాణ ఉత్త‌రాంధ్ర బెజ‌వాడ అనే తేడా లేకుండా ప్ర‌తిభావంతులంద‌రికీ అవ‌కాశాలిచ్చి ప్రోత్స‌హిస్తున్నారు. ఇక తెలంగాణ ఛాంబ‌ర్ తో క‌లిసి తెలుగు ఫిలింఛాంబ‌ర్ స‌న్నిహితంగా ప‌ని చేస్తోంది.