Begin typing your search above and press return to search.

పవన్ కు బర్త్ డే కానుకలు రెడీ చేస్తున్నారా..?

By:  Tupaki Desk   |   13 Aug 2021 10:04 PM IST
పవన్ కు బర్త్ డే కానుకలు రెడీ చేస్తున్నారా..?
X
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు మరో 20 రోజుల్లో అతి పెద్ద పండుగ రాబోతోంది. అదే పవన్ పుట్టిన రోజైన సెప్టెంబర్ 2. దీని కోసం పీకే ఫ్యాన్స్ - జనసేన కార్యకర్తలు ఇప్పటి నుంచే ప్లాన్స్ చేసుకుంటున్నారు. ప్రతి ఏడాది మాదిరిగానే ఈసారి కూడా సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో సెలెబ్రేషన్స్ చేయడానికి రెడీ అవుతున్నారు. ఇక అభిమానులను మరింత ఉత్సాహ పరచడానికి పవన్ నటిస్తున్న సినిమాల నుంచి పుట్టినరోజు కానుకలు బయటకు రానున్నాయి.

'వకీల్ సాబ్' తో రీ ఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్...అర డజను ప్రాజెక్ట్స్ కు కమిట్ అయ్యారు. ప్రస్తుతం రెండు సినిమాలను సెట్స్ మీద ఉండగా.. త్వరలోనే మరికొన్ని చిత్రాలను స్టార్ట్ చేయడానికి ప్లాన్స్ చేసుకుంటున్నారు. పవన్ బర్త్ డే సందర్భంగా ఈ సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ వచ్చే అవకాశం ఉంది. సాగర్ కె. చంద్ర దర్శకత్వంలో రానా దగ్గుబాటి తో కలిసి చేస్తున్న '#PSPKRana' చిత్రానికి సంబంధించిన టైటిల్ మరియు ఫస్ట్ గ్లిమ్స్ ను ఆగస్టు 15న విడుదల చేయనున్నారు. ఇప్పటికే సంక్రాంతి రిలీజ్ అని ప్రకటించిన మేకర్స్.. సెప్టెంబర్ 2న ఫస్ట్ సింగిల్ ని రిలీజ్ చేయబోతున్నారు.

అలానే క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో పవన్ నటిస్తున్న పీరియాడికల్ మూవీ 'హరి హర వీరమల్లు' చిత్రం నుంచి కూడా ఓ సాలిడ్ అప్డేట్ రానుంది. ఇదే క్రమంలో హరీష్ శంకర్ - పవన్ కళ్యాణ్ కలిసి చేస్తున్న #PSPK28 ప్రాజెక్ట్ కు సంబంధించిన అప్డేట్ కూడా వచ్చే అవకాశం ఉంది. గతేడాది బర్త్ డే నాడు ఈ చిత్రాన్ని అనౌన్స్ చేసిన హరీష్.. ప్రీ లుక్ పోస్టర్ తోనే ఇంట్రెస్ట్ క్రియేట్ చేసాడు. ఈ ఏడాది పుట్టినరోజుకు టైటిల్‌ అండ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ ని విడుదల చేయనున్నారని తెలుస్తోంది.

వాస్తవానికి ఉగాది పండుగ సందర్భంగా టైటిల్‌ - ఫస్ట్ లుక్‌ విడుదల చేయాలని భావించారు. కానీ కరోనా మహమ్మారి కారణంగా అది వాయిదా పడింది. కానీ ఈసారి పవన్ బర్త్ డే కానుకగా ఈ అప్డేట్స్ పక్కా వస్తాయని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఇక సురేందర్ రెడ్డి దర్శకత్వంలో పవర్ స్టార్ చేసే సినిమా నుంచి ఓ పోస్టర్ రిలీజ్ చేసే అవకాశం ఉంది. అలానే బండ్ల గణేష్ - భగవాన్-పుల్లారావు నిర్మాణంలో చేసే సినిమాలకు సంబంధించిన అనౌన్స్ మెంట్స్ వచ్చినా ఆశ్చర్య పోవలసిన అవసరం లేదు. ఏదేమైనా ఈ ఏడాది పవన్ బర్త్ డే నాడు అభిమానులకు మరిన్ని సర్ప్రైజులు రాబోతున్నాయని తెలుస్తోంది.