Begin typing your search above and press return to search.

`ప్రేమిస్తే` పిచ్చోడైన‌ భ‌ర‌త్ ఏమ‌య్యాడు?

By:  Tupaki Desk   |   13 Oct 2020 10:45 AM IST
`ప్రేమిస్తే` పిచ్చోడైన‌ భ‌ర‌త్ ఏమ‌య్యాడు?
X
సినిమా అంటే రెండున్న‌ర గంట‌ల‌ వినోదమే కాదు. సినిమా అంటే మనకు ఎదో చెప్పాలి. సినిమా అంటే మనలో కూడా కొన్ని ఎమోషన్స్ ఉంటాయి అని మనకు తెలియజెప్పాలి. సినిమా అంటే ఏం ఉంది ఆ సినిమా అని మనకు అనిపించాలి. సినిమా అంటే సరికొత్తగా ఇంకేదో. ఈ పైన చెప్పుకున్న ప్రతిదానిని మనకు చూపించిన సినిమా అది. అదే ప్రేమిస్తే. ఆ సినిమా వచ్చి అక్టోబర్ 12 కి 15 సవంత్సరాలు.

సమాజంలో మనం ఎక్కడో ఒక చోట మనం నిత్యం చూస్తూ ఉండే కథనే సినిమాగా తీస్తే మనకు చాలా బాగా నచ్చి సూపర్ హిట్టు అయింది ప్రేమిస్తే. ప్రేమించిన అమ్మాయి దక్కలేదని అబ్బాయి పిచ్చోడు అవ్వడం క్లైమాక్స్ లో నిజంగా గుండెలకు హత్తుకుంటుంది. పేద మెకానిక్ తో ధ‌న‌వంతురాలి ప్రేమాయ‌ణం క‌థ‌. పేదవాడి ప్రేమలో నిజాయతి నచ్చి ఆ ప్రేమికుల మధ్య కాలం క్షణంలా సాగిపోతుండగా.. ఇంట్లో పెద్దలు ఒప్పుకోరని ఇద్దరూ ఇంట్లో చెప్పకుండా వెళ్ళిపోతారు. వేరే ఊరులో కలసి బ్రతుకుతుండగా ఇంట్లో వాళ్ళు తెలుసుకొని మీకు పెళ్లి జరిపిస్తాం అని చెప్పి తీసుకొచ్చి మురళిని కొట్టి ఐశ్వర్య కు వేరే అబ్బాయితో పెళ్లి జరిపిస్తారు. ఆ బాధతో మురళీ కొన్ని సవంత్సరాలకు పిచ్చోడు అయిపోతాడు... ఇది త‌మిళంలో బంప‌ర్ హిట్. తెలుగులోనూ బాగానే ఆద‌రించారు. ఈ చిత్రాన్ని ద‌ర్శ‌కుడు మారుతితో క‌లిసి సురేష్ కొండేటి రిలీజ్ చేశారు.

అన్న‌ట్టు ప్రేమిస్తే భ‌ర‌త్ ఇప్పుడు ఏమ‌య్యాడు? అంత‌గా క‌నిపించ‌డం లేదు? అంటే.. అత‌డు హిందీ మ‌ల‌యాళం లోనూ నటిస్తూ అటువైపు బిజీ అయ్యాడు. 2019లో మూడు సినిమాల్లో న‌టించాడు. సింబ‌-పొట్టు-కాళిదాస్ అనే మూడు త‌మిళ చిత్రాలు భ‌ర‌త్ న‌టించిన‌వి విడుద‌ల‌య్యాయి. 2020లో అర‌డ‌జ‌ను సినిమాలు చేస్తున్నాడు. 8 అనే సినిమాతో పాటు హిందీలో స‌ల్మాన్ రాధే లోనూ ఓ పాత్ర‌లో న‌టిస్తున్నాడు. మ‌ల‌యాళంలో 6 హ‌వ‌ర్స్.. క్ష‌ణం అనే చిత్రాల్లో న‌టిస్తున్నాడు. వేరొక త‌మిళ చిత్రానికి అత‌డు సంత‌కం చేశాడు.