Begin typing your search above and press return to search.

ట్రైలర్ టాక్: మధురం.. అద్భుతం.. ప్రేమమ్

By:  Tupaki Desk   |   20 Sept 2016 10:43 PM IST
ట్రైలర్ టాక్: మధురం.. అద్భుతం.. ప్రేమమ్
X
''ప్రపంచంలో ప్రతీ ప్రేమకథా మధురంగా ఉంటుంది. మనది మనకు అద్భుతంగా ఉంటుంది'' అంటూ రచ్చలేపే డైలాగ్ తో ట్రైలర్ ఓపెన్ చేసిన నాగ చైతన్య.. ఆ తరువాత ఆదే ఫీల్ తో ''ప్రేమమ్'' ఎలా ఉండబోతుందో మనకు పరిచయం చేశాడు. పదండి ఈరోజు రిలీజైన ప్రేమమ్ ట్రైలర్ ఎలా ఉందో ఓ లుక్కేద్దాం.

గోపిసుందర్ అందించిన బ్యాగ్రౌండ్ మ్యూజిక్.. కార్తీక్ ఘట్టమనేని ఇచ్చిన విజువల్స్.. దర్శకుడు చందు మొండేటి డైలాగ్స్ అండ్ టేకింగ్.. అన్నీ పర్ఫెక్టుగా సింక్ అయ్యాయ్. ఓవరాల్ గా ''ప్రేమమ్'' ట్రైలర్లో ఉన్న ఫీల్ మాత్రం అదిరిపోయింది. ముఖ్యంగా చిన్ననాటి చైతూ.. కాలేజీ బాయ్ చైతూ.. అలాగే మెట్యూర్డ్ చైతూ గెటప్పులు చాలా బాగున్నాయి. ఇంప్రెసివ్ అనే చెప్పాలి. ఇక శృతి హాసన్ బ్యూటిఫుల్ లుక్.. అనుపమ పరమేశ్వరన్ లోని అమాయకత్వం.. మడోన్నా సెబాస్టియన్ ఛలాకీతనం బాగా నప్పాయి. అలాగే హీరో స్నేహితులుగా చైతన్య కృష్ణ, ప్రవీణ్‌, శ్రీనివాస్ రెడ్డి కూడా బాగున్నారు. చూస్తుంటే కార్తికేయ సినిమాతో సంచలనం సృష్టించిన చందూ మొండేటి.. ఇప్పుడు ప్రేమమ్ తో మరో బ్లాక్ బస్టర్ తన ఖాతాలో వేసుకుంటున్నాడనే అనిపిస్తోంది.

ఇక ఈ ట్రైలర్ గురించి నోటీస్ చేయాల్సిన ఒక సరిక్రొత్త విషయం ఏంటంటే.. ఇదొక ప్రేమకథ కాబట్టి.. ఈ సినిమా ట్రైలర్ లెంగ్త్ ను కరక్టుగా 1: 43 నిమిషాలు ఉంచారు. ఈ 143 ఏ 143 అనేది మనం వేరేగా చెప్పుకోవాలేంటండీ. ఈ క్రియేటివిటీకి ప్రేమ ఎప్పుడూ దాసోహమే.