Begin typing your search above and press return to search.

ప్రేమమ్ రిలీజ్ డేట్.. అలా క్లారిటీ

By:  Tupaki Desk   |   21 Sept 2016 5:46 PM IST
ప్రేమమ్ రిలీజ్ డేట్.. అలా క్లారిటీ
X
''సెన్సార్ కార్యక్రమాలు పూర్తయితేనే ప్రేమమ్ అక్టోబర్ 9న రిలీజవుతుంది. సారీ సారీ అక్టోబర్ 7న? ఏమో నాకు తెలియదు. నేను ఇప్పుడు రిలీజ్ డేట్ చెప్పేస్తే వాళ్లకి కష్టం'' అంటూ కామెంట్ చేశాడు కింగ్ నాగార్జున. ప్రేమమ్ ఆడియో రిలీజ్ ఫంక్షన్లో ఆయన చేసిన ఈ కామెంట్లు ఇప్పుడు అందరినీ షాక్ కు గురిచేస్తున్నాయి. అయితే ఇంతలోనే నాగ చైనత్య క్లారిటీ ఇచ్చేసి కాస్త ఉపశమనం కలిగించాడు.

అక్టోబర్ 7న మీ ముందుకు రాబోతుంది అంటూ చైతన్య స్వయంగా రిలీజ్ డేటును ప్రకటించేశాడు. నాగ్ తెచ్చిన కన్ఫ్యూజన్ కు చైతన్య క్లారిటీ ఇవ్వడంతో.. ఇప్పుడు దసరా రేస్ అంతా ఒకింత క్లియర్ అయిపోయింది. ఇప్పటివరకు ప్రేమమ్ డేట్ అప్పుడూ ఇప్పుడూ అంటూ చాలాసార్లు వినిపించడంతో.. ఫ్యాన్స్ అందరూ కాస్త ఊపరిబిగపట్టుకుని డేట్ కోసం వెయిట్ చేస్తున్నారు. గతంలో సెప్టెంబర్ 9 అని గట్టిగా వినిపించినా.. దసరాకు 'ధృవ' రాదనే కన్ఫర్మేషన్ ఉండడంతో ప్రేమమ్ ఏకంగా పండుగనాటికి షిఫ్ట్ అయిపోయింది.

అక్టోబర్ 7న ప్రేమమ్ మెయిన్ సినిమా అయితే.. తరువాత స్లాట్ ను ఈడు గోల్డ్ ఏహా ఆక్యుపై చేస్తోంది. అదే రోజున తమన్నా అభినేత్రి కూడా వస్తోంది. ఇకపోతే జాగ్యువర్ సినిమా కూడా అదే రోజున వస్తున్న సంగతి తెలిసిందే.