Begin typing your search above and press return to search.
అక్టోబర్ కి జంపైన ప్రేమమ్
By: Tupaki Desk | 24 Aug 2016 2:31 PM ISTఈ మధ్యకాలంలో రొమాంటిక్ సినిమాలు అస్సలు రానే రావట్లేదు. వస్తున్నవన్నీ కామెడీ సినిమాలే. కమర్షియల్ మసాలా సినిమాలన్నీ కామెడీ మీదనే ఆధారపడుతున్నాయి. అందుకే నాగ చైతన్య ''ప్రేమమ్'' సినిమా వస్తోందంటే ఖచ్చితంగా ఒక మాంచి రొమాంటిక్ సినిమా రాబోతోందని అందరూ ఆనందపడ్డారు. సెప్టెంబర్ లో రిలీజవుతుందంటే వావ్ అనుకున్నారు. కాని అసలు షాక్ ఇప్పుడే తగిలింది.
సినిమా నిర్మాణాంతర పనులు దాదాపు పూర్తికావొచ్చినా కూడా.. గతంలో నాగ చైతన్య స్వయంగా ఈ సినిమా సెప్టెంబర్ లో విడుదలవుతుందని చెప్పినా కూడా.. ఇప్పుడు మొత్తం తేడా కొట్టేసింది. అసలు ఆగస్టు నెలలో జరగాల్సిన ఆడియో ఫంక్షన్ ను.. ఏకంగా సెప్టెంబర్ 20 అక్కినేని బర్త్ డే నాటికి పోస్టుపోన్ చేశారు. ఇప్పటికే 'ఎవరే' సాంగ్ బాగా హిట్టయినా కూడా.. ఆడియో మొత్తం కావాలంటే మాత్రం వచ్చే నెల 20 వరకు వెయిట్ చేయాల్సిందే. ఇకపోతే సినిమాను దసరా కానుకగా అక్టోబర్ లో రిలీజ్ చేస్తారట.
ఆల్రెడీ అక్టోబర్ లో రామ్ చరణ్ ధృవ - రామ్ హైపర్.. ఇలాంటి పెద్ద సినిమాల లైనప్ అంతా ఉంది. మరి ఆ మధ్యలో ప్రేమమ్ సినిమాను ఎక్కడ ఇరికిస్తారో చెప్పలేం. అది సంగతి.