Begin typing your search above and press return to search.

క్లియర్ విన్నర్.. ప్రేమమ్

By:  Tupaki Desk   |   8 Oct 2016 1:30 PM GMT
క్లియర్ విన్నర్.. ప్రేమమ్
X
మొత్తానికి దసరా సినిమాల సంగతి తేలిపోయింది. ఒకే వీకెండ్లో ఐదు సినిమాలు.. అందులోనూ ఒకే రోజు నాలుగు సినిమాలు రిలీజై ఆశ్చర్యపరిచాయి. వీటిలో అత్యధిక అంచనాలున్నది ‘ప్రేమమ్’ సినిమాకే. అదే సమయంలో మిగతా సినిమాలు కూడా బాగానే ఆసక్తి రేకెత్తించాయి. ఐతే ఏ సినిమా అయితే అత్యధిక అంచనాలతో రిలీజైందో ఆ సినిమానే దసరా విజేతగా నిలిచింది. కేవలం కమర్షియల్ సక్సెస్ సాధించడం మాత్రమే కాదు.. విమర్శకుల ప్రశంసలు అందుకోవడంలోనూ ‘ప్రేమమ్’ ముందుంది. కన్నడ కుర్రాడు నిఖిల్ కుమార్ హీరోగా పరిచయమైన ‘జాగ్వార్’ను రెండో రోజు నుంచి పట్టించుకోవడం మానేశారు జనాలు. దాని గురించి మాట్లాడేదేం లేదు.

ఇక ‘ప్రేమమ్’కు పోటీగా విడుదలైన మిగతా మూడు సినిమాల్లో ప్రకాష్ రాజ్ మూవీ ‘మన ఊరి రామాయణం’ మంచి సినిమాగా పేరు తెచ్చుకుంది. ఐతే ఇది కమర్షియల్ గా వర్కవుటయ్యే అవకాశాలు కనిపించట్లేదు. ఓ వర్గం ప్రేక్షకులకు మాత్రమే నచ్చేలా ఉంది. రీచ్ బాగా తక్కువ. సునీల్ సినిమా ‘ఈడు గోల్డ్ ఎహే’ పూర్తిగా నిరాశ పరిచింది. టాక్ ఏమంత గొప్పగా లేదు. ఐతే బి-సి సెంటర్ల ప్రేక్షకుల ఆదరణ పొందే అవకాశముంది. ‘అభినేత్రి’ యావరేజ్ మూవీనే. తమన్నా గ్లామర్.. ప్రభుదేవా మార్కు కామెడీ సినిమాకు ఆకర్షణగా నిలిచాయి. కామెడీ పర్వాలేదు. అంతకుమించి చెప్పుకోవడానికి లేదు. ఇక ‘ప్రేమమ్’ విషయానికి వస్తే.. పూర్తి పాజిటివ్ టాక్ ఉంది. కలెక్షన్లు కూడా చాలా బాగున్నాయి. పెద్ద లెవెల్లో రిలీజ్ చేయగా.. అన్ని చోట్లా హౌస్ ఫుల్స్ తో నడుస్తోందీ సినిమా.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/