Begin typing your search above and press return to search.

ఆ నంబర్‌ తో నాకు సంబంధం లేదన్న ప్రేమమ్ బ్యూటీ

By:  Tupaki Desk   |   1 Feb 2022 5:30 AM GMT
ఆ నంబర్‌ తో నాకు సంబంధం లేదన్న ప్రేమమ్ బ్యూటీ
X
ఈమద్య కాలంలో పెరిగిన టెక్నాలజీ ని ఉపయోగించుకొని మోసాలకు పాల్పడుతున్న వారి సంఖ్య ఎక్కువ అవుతుంది. ఇప్పటి వరకు ఆన్ లైన్ ద్వారా ఎంతో మంది మోసాలకు పాల్పడటం.. మోసపోవడం మనం చూస్తూనే ఉన్నాం. ఒకరి పేరుతో సోషల్‌ మీడియాలో అకౌంట్‌ ను క్రియేట్‌ చేసి వారికి తెలిసిన వారిని డబ్బులు అడగడం చేస్తున్నారు. మరో వైపు సెలబ్రిటీల పేర్లు పెట్టుకుని మోసాలకు పాల్పడుతున్న వారు కూడా చాలా మంది ఉన్నారు. తాజాగా అనుపమ పరమేశ్వరన్‌ పేరుతో మోసానికి పాల్పడుతున్న వ్యక్తి గురించి బయటకు వచ్చింది. నేను అనుపమ పరమేశ్వరన్‌ ను అంటూ ఒక అమెరికన్‌ నెంబర్‌ నుండి మెసేజ్ లు వస్తున్నాయట. ఆ నెంబర్‌ నుండి కాల్స్ మరియు మెసేజ్ లు వస్తున్న నేపథ్యంలో కొందరు మోసపోతున్నారు.

ఆ విషయాన్ని అనుపమ సోషల్‌ మీడియా ద్వారా షేర్‌ చేసింది. నా పేరు చెప్పి కొందరు మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు అంటూ ఆ నెంబర్ ను కూడా షేర్‌ చేసింది. ఈ నెంబర్ నుండి వచ్చే మెసేజ్ లు కాని కాల్స్ కాని నాకు సంబంధం లేకుండా వస్తున్నాయి. ఆ నెంబర్‌ నాది కాదు. ఆ నెంబర్‌ ను కొందరు నాది అని నమ్మి మోసపోయినట్లుగా నా దృష్టికి వచ్చిందని ఆమె చెప్పుకొచ్చింది. అందుకే ఇలాంటి నెంబర్ ల నుండి నా పేరు చెప్పి మోసం చేసేందుకు ప్రయత్నించే అవకాశం ఉంది నమ్మవద్దు అంటూ అనుపమ విజ్ఞప్తి చేసింది. ప్రస్తుతం సోషల్‌ మీడియా ద్వారానే కాకుండా ఇలా ఫోన్ ల ద్వారా కూడా మోసాలకు పాల్పడుతున్నారు. నాకు ఎందుకులే అనుకోకుండా అనుపమ బాధ్యతతో తన పేరుతో వచ్చే కాల్స్ ను నమ్మవద్దని చెప్పడం అభినందనీయం అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

ఇక ఈ అమ్మడి సినిమాల విషయానికి వస్తే.. ప్రేమమ్‌ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయిన ఈఅమ్మడు తెలుగు.. తమిళం మరియు మలయాళం సినిమాల్లోనే కాకుండా వెబ్‌ సిరీస్ మరియు షార్ట్‌ ఫిల్మ్స్ లో నటిస్తూ సోషల్‌ మీడియా ద్వారా అభిమానులను ఎంటర్‌ టైన్ చేస్తూ వస్తుంది. తాజాగా ఈఅమ్మడు దిల్ రాజు వారసుడు అయిన అశ్విన్‌ హీరోగా నటించిన రౌడీ బాయ్స్ సినిమా లో హీరోయిన్ గా నటించింది. ఆ సినిమాలో అశ్విన్‌ తో ఈ అమ్మడి రొమాన్స్ ముఖ్యంగా ముద్దు సన్నివేశం చర్చనీయాంశం అయ్యింది. అన్ని వర్గాల వారిని ఆకట్టుకున్న ఆ సినిమా లో ఈ అమ్మడు ప్రధాన ఆకర్షణగా నిలిచింది.

సోషల్‌ మీడియాలో రెగ్యులర్ గా ఫొటోలు మరియు వీడియోలు షేర్‌ చేసే ఈ అమ్మడు తాజాగా బేబీ బంప్ ఫొటోలను షేర్‌ చేసి అందరికి షాక్ ఇచ్చింది. రెండేళ్ల క్రితం ఒక సినిమా కోసం ఇలా చేయాల్సి వచ్చిందని ఆమె సరదాగా ఆ ఫొటోలను షేర్‌ చేసింది.