Begin typing your search above and press return to search.

ప్రేమమ్ బ్యూటీ కండీషన్స్‌.. ఇందుకే స్టార్స్‌ సినిమాల్లో ఛాన్స్ రావట్లేదా?

By:  Tupaki Desk   |   26 Aug 2022 10:30 AM GMT
ప్రేమమ్ బ్యూటీ కండీషన్స్‌.. ఇందుకే స్టార్స్‌ సినిమాల్లో ఛాన్స్ రావట్లేదా?
X
మలయాళ చిత్రం ప్రేమమ్ తో సౌత్ లో మంచి గుర్తింపు దక్కించుకుని తెలుగు లో కూడా ప్రేమమ్‌ సినిమా లో చేయడం ద్వారా తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువ అయిన ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్‌. ఈ అమ్మడు సినిమాల సంఖ్య పెంచుకోవడం కంటే కూడా అధికంగా మంచి సినిమాల్లో నటించాలనే ఉద్దేశ్యంతో సినిమాల ఎంపిక చేసుకుంటున్నట్లుగా తెలుస్తోంది.

తాజాగా కార్తికేయ 2 సినిమా తో సక్సెస్‌ ను తన ఖాతాలో వేసుకున్న ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్ ఒక ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. స్టార్‌ హీరోల సినిమాల్లో నటించక పోవడంకు గల కారణం ను ఈ అమ్మడు చెప్పుకొచ్చింది. సినిమాల ఎంపిక విషయంలో కొన్ని విషయాలను తాను పరిగణనలోకి తీసుకుంటాను అంటూ ఈ అమ్మడు పేర్కొంది.

ముఖ్యంగా కథ లో హీరోయిన్ పాత్ర యొక్క ప్రాముఖ్యతను చూస్తాను. హీరో చుట్టూ తిరుగుతూ హీరోలను పొగుడుతూ ఉండే పాత్రను నేను ఎప్పుడు కూడా చేయను. హీరోల చుట్టూ తిరుగుతూ కథ లో పెద్ద గా ప్రాముఖ్యత లేని పాత్రలు నేను ఎప్పుడు చేయాలి అనుకోవడం లేదు అంటూ అనుపమ చెప్పుకొచ్చింది.

హీరోలకు ప్రాముఖ్యత ఉండటంలో తప్పులేదు కానీ హీరోయిన్ పాత్రను తక్కువ చేసి చూపించడం.. ప్రాముఖ్యత లేకుండా చూపించడం నాకు నచ్చదు. కథ హీరో అయితేనే నేను ఆ సినిమాలను కమిట్‌ అవుతాను అంటూ కండీషన్స్ పెడుతుంది. అనుపమ పరమేశ్వరన్‌ ఇలాంటి కండీషన్స్ పెట్టడం వల్ల స్టార్ హీరోల సినిమాల్లో ఆఫర్లు రావడం లేదు అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.