Begin typing your search above and press return to search.

ఆ హీరోయిన్ భ‌ర్త అరెస్ట్‌!

By:  Tupaki Desk   |   3 July 2019 6:09 PM IST
ఆ హీరోయిన్ భ‌ర్త అరెస్ట్‌!
X
ఒక్క సినిమాతో భారీ పాపులార్టీని సొంతం చేసుకోవ‌టం మామూలు విష‌యం కాదు. యావ‌త్ దేశం మొత్తం ఆమెకు ఫిదా అయిపోయిన‌ప్ప‌టికీ.. భారీ ఆఫ‌ర్లు వ‌రుస పెట్టిన‌ప్ప‌టికీ చ‌లించ‌కుండా ఒక్క సినిమాతో దూర‌మైన ఇమేజ్ ప్రేమ‌పావురాలు ఫేం భాగ్య‌శ్రీ సొంతం.

అయితే.. త‌ర్వాతి కాలంలో భ‌ర్త‌ను హీరోగా పెట్టి సినిమాలు తీస్తాన‌ని చెప్పినా.. అదేమీ వ‌ర్క్ వుట్ కాలేదు. కాకుంటే మొద‌ట్నించి ఇప్ప‌టివ‌ర‌కూ ఒక‌టే రూల్ మీద ఉన్న న‌టిగా ఆమెను చెప్పాలి.ఇదిలా ఉంటే తాజాగా ఆమె భ‌ర్త హిమాల‌య దాసానీని పోలీసులు అరెస్ట్ చేయ‌టం సంచ‌ల‌నంగా మారింది.

గ్లాంబ్లింగ్ రాకెట్ కు సంబంధించిన ఆరోప‌ణ‌ల‌తో అత‌న్ని పోలీసులు అరెస్ట్ చేశారు. అనంత‌రం బెయిల్ మీద విడుద‌ల చేసిన‌ట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన మ‌రిన్ని వివ‌రాలు బ‌య‌ట‌కురావాల్సి ఉంది. తొలి చిత్రంతోనే టాప్ ఇమేజ్ సొంతం చేసుకున్న ఆమె త‌న తొలి సినిమాకే ఫిలింఫేర్ అవార్డును సొంతం చేసుకున్నారు.

త‌న చిన్న‌నాటి స్నేహితుడు హిమాల‌య‌ను ప్రేమించి పెళ్లాడిన ఆమె తీరు అప్ప‌ట్లో హాట్ టాపిక్ గా మారింది. భాగ్య‌శ్రీ‌కు ఇద్ద‌రు సంతానం. వారిలో కొడుకు అభిమ‌న్యు దాసానిని హీరోగా ప‌రిచ‌యం చేస్తూ ఒక సినిమాను రూపొందించారు. ‘మర్ద్‌ కో దర్ద్‌ నహీ హోతా’ పేరుతో వ‌చ్చిన ఈ మూవీ మార్చిలో విడుద‌లైంది. అయితే.. విజ‌య‌వంతం కాలేదు. ఇదిలా ఉంటే.. తాజాగా భ‌ర్త అరెస్ట్ ఇప్పుడు బాలీవుడ్ లో హాట్ టాపిక్ అయ్యింది.