Begin typing your search above and press return to search.

ప్రేమ కథలో భయపెట్టే చిత్రం

By:  Tupaki Desk   |   17 Oct 2018 10:21 AM GMT
ప్రేమ కథలో భయపెట్టే చిత్రం
X
హీరో సుధీర్ బాబు కెరీర్ లో పెద్ద హిట్ గా నిలిచిన హారర్ థ్రిల్లర్ ప్రేమ కథా చిత్రం సీక్వెల్ అదే పేరుకి 2 యాడ్ చేసుకుని రూపొందుతోంది. కాకపోతే ఈసారి కథానాయకుడు దర్శకుడు హీరొయిన్ అందరూ మారారు. హరికిషన్ దర్శకత్వంలో సుమంత్ అశ్విన్ హీరోగా రూపొందుతున్న ప్రేమ కథా చిత్రం 2లో హీరోయిన్ నందితా శ్వేతాకు సంబంధించిన ఫస్ట్ లుక్ ఇవాళ విడుదల చేసారు.

వెరైటీగా పచ్చని పెళ్లి దుస్తుల్లో ఉగ్ర రూపంలో ఎరుపెక్కిన కళ్ళతో ఎవరినో కోపంతో చూస్తూ కాలి కింద బంతిని తొక్కి పడుతూ నందిని శ్వేతా లుక్ చూస్తుటే ఏదో భారీ ఎత్తున భయపెట్టే ప్లాన్ చేసినట్టు కనిపిస్తోంది. ఎక్కడికి పోతావు చిన్నవాడాలో నిఖిల్ వెంటపడి భయపెట్టే పాత్రలో జీవించిన నందిని శ్వేతా మరోసారి అంతకు మించిన పాత్రనే దక్కించుకున్నట్టు కనిపిస్తోంది. సుదర్శన్ రెడ్డి నిర్మాణంలో రూపొందుతున్న ప్రేమ కథ చిత్రం 2 షూటింగ్ కీలక భాగం ఇప్పటికే పూర్తి చేసుకుంది. తర్వాత విడుదల తేదీకి సంబదించిన నిర్ణయం తీసుకోబోతున్నారు. ఈ మధ్య కాలంలో తెలుగులో హారర్ జానర్ లో సినిమాలు తగ్గినప్పటికీ తమ చిత్రం అంచనాలు మించి ఉంటుందని దర్శక నిర్మాతలు భరోసా ఇస్తున్నారు.

ప్రేమ కథ చిత్రం ఒక ట్రెండ్ కి నాంది పలికిందని దానికి కొనసాగింపుగా వస్తున్న ఈ మూవీ ఆ బ్రాండ్ ని కాపాడేలా ఉంటుందని చెబుతున్నారు. హ్యాపీ వెడ్డింగ్ తర్వాత సుమంత్ అశ్విన్ చేస్తున్న మూవీ ఇదే. ఇటీవలే 7 సినిమా పోస్టర్ ద్వారా ఆసక్తి రేపిన నందిత శ్వేతా ఇప్పుడీ ప్రేమ కథ చిత్రం 2 లుక్ తో మరోసారి ప్రేక్షకుల దృష్టిని ఆకట్టుకోవడం విశేషం.