Begin typing your search above and press return to search.
రేసులో మరో ఎన్నారై దర్శకుడు
By: Tupaki Desk | 15 Nov 2017 2:22 PM ISTఒకప్పుడు డైరెక్టర్ అవ్వాలంటే అసిస్టెంట్ డైరక్టర్ గా చేయాలి అనే ఒక రూల్ ఉండేది. కానీ నేటితరంలో చాలా మంది ఆ తరహా రూల్స్ ని బ్రేక్ చేస్తున్నారు. అవసరమైతే వారే నిర్మించుకొని మరి సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. ప్రస్తుతం షార్ట్ ఫిలిమ్స్ తీసేవారు కూడా ఒక ఫుల్ లెన్త్ సినిమాను వెండితెరపై సక్సెస్ గా ఆడిస్తున్నారు. సినిమాపై మక్కువతో ఉద్యోగాలను కూడా వదిలేసుకొని మరి డైరెక్షన్ లోకి అడుగుపెడుతున్నారు.
ఇప్పుడు అదే తరహాలో తన అదృష్టాన్ని పరీక్షించుకొంటున్నాడు ఒక ఎన్నారై దర్శకుడు. ఎన్నారై గోవర్థన్ గజ్జల తెరకెక్కించిన మొదటి చిత్రం ‘ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినం’. ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్బంగా ఆయన ఇచ్చిన ఓక ఇంటర్వ్యూలో ముఖ్యమైన విషయాలను తెలిపాడు. గోవర్ధన్ మాట్లాడుతూ.. సినిమాపై మక్కువతోనే డైరెక్షన్ చేశాను. అడ్డా సినిమా దర్శకుడు కార్తిక్ రెడ్డి మా అన్నయ్యే. ప్రస్తుతం మంచు విష్ణుతో ఓటరు అనే సినిమా చేస్తున్నాడు. అయన నాకు చాలా సపోర్ట్ చేస్తున్నారు. అమెరికాలో యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో ఫిలిం మేకింగ్ కోర్స్ చేశాను. ఆ తర్వాత కొన్ని షార్ట్ ఫిలిమ్స్ చేయడంతో ఒక సినిమాను తెరకెక్కించగలను అనే నమ్మకం నాకు వచ్చింది.
ఇక సినిమా గురించి మాట్లాడుతూ.. ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినం’ అనే సినిమా చాలా కొత్తగా ఉంటుంది. ట్రయాంగిల్ లవ్ స్టోరీ అయినప్పటికీ. సినిమాలో ఇద్దరి మధ్యనే ఎక్కువగా ప్రేమ కొనసాగుతోంది. ఆ పాయింట్ అందరిని ఆకట్టుకుంటుంది. దాదాపు 300 మందికి పైగా సినిమాను చూపించాం. అందరు స్క్రీన్ ప్లే చాలా బావుందని చెప్పారు. ఇక సినిమాను సెప్టెంబర్ లోనే రిలీజ్ చేద్దాం అనుకున్నాం కానీ కుదరలేదు. ప్రస్తుతం తియేటర్స్ కొరత ఉన్న సినిమా డిఫెరెంట్ లవ్ స్టోరీ కాబట్టి తప్పకుండా నచ్చుతుంది. అంతే కాకుండా విడుదల తర్వాత ధియేటర్స్ పెరిగే అవకాశాలు ఉంటాయని దర్శకుడు గోవర్ధన్ తెలిపాడు.