Begin typing your search above and press return to search.
కూతురితో హీరో సినిమా.. పోస్టర్ బాగుందే
By: Tupaki Desk | 10 Feb 2017 3:25 PMతెలుగు-తమిళ్ భాషల్లో హీరోగా మంచి పాపులారిటీ ఉన్న సీనియర్ హీరో అర్జున్.. ఇప్పుడు ప్రేమ బరహ అంటూ ఓ కొత్త సినిమా తీస్తున్నాడు. అర్జున్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రం.. కన్నడ-తమిళ్ బై లింగ్యువల్ గా రూపుదిద్దుకుంటోంది. కన్నడ కుర్రాడు చందన్ కుమార్ హీరోగా నటిస్తున్న ఈ మూవీ స్పెషాలిటీ.. అర్జున్ కూతురు ఐశ్వర్య అర్జున్ హీరోయిన్ గా నటిస్తుండడమే.
కూతురుని హీరోయిన్ గా పెట్టి లవ్ స్టోరీ తెరకెక్కించే సాహసం అందరూ చేయలేరు. కానీ అర్జున్ ఇప్పుడా చిత్రాన్ని దాదాపు ఫినిష్ చేసేసాడు. కొన్ని రోజుల క్రితం విడుదలైన 'ప్రేమ బరహా.. కోటి తరహా' అంటూ సాగే ఆడియో సాంగ్ అందరినీ ఆకట్టుకుంది. ఇప్పుడీ ప్రేమ బరహకి మోషన్ పోస్టర్ రిలీజ్ చేశాడు అర్జున్. సలీం-అనార్కలి టైపులో ఓ పోస్టర్ లో ఇద్దరు చేతులు పట్టుకున్న రొమాంటిక్ సీన్ తో ఈ పోస్టర్ ప్రారంభమవుతుంది. వెనుకాల బాంబులు పేలుతుంటే.. ఇద్దరూ పరిగెడుతున్న లుక్ ఈ మోషన్ పోస్టర్ లో చివర దర్శనమిస్తుంది.
హీరో చందన్ తో పాటు హీరోయిన్ ఐశ్వర్య అర్జున్ మెడలో ఐడీ కార్డులతో దాదాపు మిలిటరీ టైపు డ్రెస్సులతో కనిపిస్తారు. తనకు బాగా అచ్చొచ్చిన.. తనకు నచ్చిన జోనర్ అయిన టెర్రరిజం కాన్సెప్ట్ నే ఇతివృత్తంగా ఈ ప్రేమ బరహ చిత్రాన్ని తీసినట్లుగా ఉన్నాడు అర్జున్.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/