Begin typing your search above and press return to search.

అమీ ఇదేం పద్దతి అమ్మీ..?

By:  Tupaki Desk   |   8 Oct 2018 1:33 PM IST
అమీ ఇదేం పద్దతి అమ్మీ..?
X
కన్నడ స్టార్ హీరో కిచ్చ సుదీప్ నెక్స్ట్ సినిమా 'విలన్' ఈ నెల 18 వ తేదీన కన్నడనాట రిలీజ్ అవుతోంది. ఈ సినిమా కు దర్శకుడు ప్రేమ్. ప్రమోషన్స్ జోరుగానే సాగుతున్నాయిగానీ డైరెక్టర్ మాత్రం హీరోయిన్ విషయంలో మాత్రం తన అసంతృప్తిని ఓపెన్ గానే వెళ్ళగక్కాడు. హీరోయిన్ ఎవరో కాదు 'ఎవడు' ఫేమ్ అమీ జాక్సన్. రజనీకాంత్ '2.0' లో కూడా ఆమే హీరోయిన్ అన్న సంగతి తెలుసు కదా..

అమీ 'విలన్' ప్రమోషన్స్ కు హారజవడం లేదట. పైగా ప్రీరిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్ చేసేందుకు తను ఏ డేట్ లో అందుబాటులో ఉంటుందో తెలుసుకుందామని ప్రయత్నిస్తే రెస్పాన్స్ ఇవ్వడం లేదట. ఈ సినిమాలో సుదీప్ తో పాటు శివన్న కూడా ఒక ముఖ్య పాత్రలో నటిస్తున్నాడు. దీంతో ప్రీరిలీజ్ ఈవెంట్ డేట్ లాక్ చేయాలంటే అమీ తో పాటు గా వారిద్దరికి ఆ డేట్ అనుకూలంగా ఉండాలి.. మరి అమీ మాత్రం ఇవేవీ పట్టించుకోకుండా ఉందట. ప్రీ రిలీజ్ ఈవెంట్ కు హాజరవుతుందో లేదో కన్ఫాం చేయడం లేదని.. అసలు ఫోన్ కాల్సే ఎత్తడం లేదని వాపోతున్నాడు డైరెక్టర్.

అమీ జాక్సన్ ఎందుకు అలా చేస్తోందో తెలీదుగానీ డైరెక్టర్ ప్రేమ్ మాత్రం ఆమెకు పద్దతీ పాడూ లేదని మండిపడుతున్నాడు. ఆమె బాధ్యతగా ప్రవర్తించాలని అంటున్నాడు. ఒకవేళ ఇదంతా నిజమే అయితే అమీ తన పద్దతి మార్చుకోవాలి. లేదంటే ఫ్యూచర్ లో ఆమెకే ఇబ్బంది.