Begin typing your search above and press return to search.

'ప్రీల్యూడ్ ఆఫ్ పుష్పరాజ్': అడవుల్లో పరుగెడుతున్న బన్నీ..!

By:  Tupaki Desk   |   3 April 2021 8:55 AM GMT
ప్రీల్యూడ్ ఆఫ్ పుష్పరాజ్: అడవుల్లో పరుగెడుతున్న బన్నీ..!
X
టైలిష్ స్టార్ అల్లు అర్జున్ - రష్మిక మందన్నా జంటగా నటిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ డ్రామా ఫిల్మ్ ''పుష్ప''. సుకుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఎర్ర చందనం స్మగ్లింగ్‌ నేపథ్యంలో రానున్న ఈ చిత్రంలో లారీ డ్రైవర్‌ పుష్పరాజ్ పాత్రలో బన్నీ కనిపించనున్నాడు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడం, హిందీ భాషల్లో ఆగస్టు 13న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. ఫస్ట్ లుక్ మినహా ఇప్పటి వరకు ఎలాంటి అప్డేట్ ఇవ్వని మేకర్స్.. ఏప్రిల్ 8న అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా స్పెషల్ గిఫ్ట్ ఇవ్వడానికి రెడీ అయ్యారు. ఈ క్రమంలో తాజాగా 'ప్రీ ల్యూడ్ ఆఫ్ పుష్పరాజ్' పేరుతో ఓ స్మాల్ గ్లిమ్స్ వదిలారు.

చేతులు వెనక్కి కట్టివేయబడి ముఖంపై ముసుగుతో ఉన్న అల్లు అర్జున్ దట్టమైన అడవిలో పరుగెత్తుతూ కనిపిస్తున్న ఈ గ్లిమ్స్ విశేషంగా ఆకట్టుకుంటోంది. దీనికి సినిమాటోగ్రాఫర్ మిరోస్లా కుబా బ్రోజెక్ విజువల్స్.. దేవిశ్రీప్రసాద్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయాయి. ఈ సందర్భంగా ఏప్రిల్ 7న సాయంత్రం గం. 6.12 నిమిషాలకు 'పుష్ప రాజ్' ను పరిచయం చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. 18 సెకండ్ల 'ప్రీ ల్యూడ్ ఆఫ్ పుష్పరాజ్' గ్లిమ్స్ చూసి ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.

కాగా, 'పుష్ప' సినిమాలో మలయాళ నేచురల్ స్టార్ ఫహాద్ ఫాజిల్ విలన్ గా నటిస్తుండగా.. ప్రకాష్ రాజ్ - జగపతిబాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ పాన్ ఇండియన్ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని - వై. రవి శంకర్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ముత్యం శెట్టి మీడియా వారు నిర్మాణంలో భాగస్వాములుగా వ్వవహరిస్తున్నారు.