Begin typing your search above and press return to search.

కరోనా టెస్ట్​.. 20 వ సారి.. ప్రీతీ జింటా వీడియో వైరల్​

By:  Tupaki Desk   |   22 Oct 2020 9:30 AM IST
కరోనా టెస్ట్​.. 20 వ సారి.. ప్రీతీ జింటా వీడియో వైరల్​
X
యూఏఈలో జరుగుతున్న ఐపీఎల్లో కరోనా రాకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మ్యాచ్‌లు ఆరంభానికి ముందే బయో బబుల్‌ వాతావరణం సృష్టించి ఆటగాళ్లు, ఆటగాళ్ల కుటుంబ సభ్యులు, కోచింగ్ సిబ్బంది, సహాయ సిబ్బందిని అందులో ఉంచింది. వీళ్లందరికీ నాలుగు రోజులకోసారి కరోనా పరీక్షలు చేస్తారు. ఈ క్రమంలో ఐపీఎల్ 2020 కోసం యూఏఈ వెళ్లిన కింగ్స్‌ లెవ‌న్ పంజాబ్‌ సహ యజమాని ప్రీతి జింటా కూడా తాజాగా టెస్ట్ చేయించుకున్నారు. కరోనా టెస్టు కోసం శాంపిళ్లను సేకరిస్తోన్న ఓ వీడియోను ఆమె ఇన్​స్టాలో పోస్ట్​ చేశారు.

‘ఇప్పటి వరకూ నేను 20 సార్లు కరోనా టెస్టులు చేయించుకున్నాను. నేనిప్పుడు కోవిడ్ టెస్ట్ క్వీన్ అయిపోయా. నా దగ్గర టెస్ట్​ శాంపిళ్లు సేకరిస్తున్న వైద్య సిబ్బందికి ఎంత ఓపిక ఉందో. వాళ్లను మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నా’ అంటూ ఆమె పేర్కొన్నారు. 'చాలా మంది బయో బబుల్ అంటే ఏంటని నన్ను అడుగుతున్నారు. బయో బబుల్ అంటే.. ఆరు రోజుల క్వారంటైన్, నాలుగు రోజులకోసారి కోవిడ్ టెస్టులు చేయించుకోవడం. మనకు కేటాయించిన గదికే పరిమితం కావడం. జట్టుకు కేటాయించిన రెస్టారెంట్, జిమ్, స్టేడియంను మాత్రమే ఉపయోగించడం. బీసీసీఐ, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ యాజమాన్యంకు చాలా థ్యాంక్స్. మమ్మల్ని వీరు ఎంతో జాగ్రత్తగా చూసుకుంటున్నారు అని ఆమె చెప్పారు.

గెలుపు సంబరాలు
తాజాగా సూపర్‌ ఓవర్‌లో పంజాబ్‌ గెలిచిన తర్వాత గెలుపు సంబరాల్ని వీడియో రూపంలో పంచుకున్నారు ప్రీతి జింటా. 'మనం ఏమీ మాట్లాడాలో తెలియనప్పుడు చేసే పనులే మాట్లాడతాయి. రెండు సూపర్‌ ఓవర్లు. ఓ మై గాడ్‌. నేను ఇంకా షేక్‌ అవుతూనే ఉన్నాను. ఇది కింగ్స్‌ పంజాబ్‌ బాయ్స్‌ విజయం. వాటే గేమ్‌. వాటే నైట్‌.. వాటే ఫీలింగ్‌. టీమ్‌ ఎఫర్ట్‌కు థాంక్యూ. ఇక్కడ టీమ్‌ వర్క్‌ అత్యుత్తమం' అని ప్రీతి ట్విట్టర్ వేదికగా తన సంతోషాన్ని అభిమానులతో పంచుకున్నారు.

బయో బబుల్ అంటే
బయో బబుల్ అంటే.. పూర్తిగా శానిటైజ్ చేసిన ప్రాంతం. క్వారంటైన్ పూర్తి చేసుకొని, కరోనా టెస్టులో నెగటివ్ అని తేలితేనే బయో బబుల్‌లోకి ప్రవేశం ఉంటుంది. బయటి వాళ్లతో కాంటాక్ట్ అయ్యే వీలుండదు. ఫలితంగా కోవిడ్ బారిన పడే ముప్పు తగ్గుతుంది. ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి ఆటగాళ్లు, సిబ్బంది ప్రయాణించినా.. అన్ని జాగ్రత్తలు తీసుకుంటారు. ఆటగాళ్ల మొదలుకుని హోటల్ అండ్ గ్రౌండ్ సిబ్బందికి సైతం కరోనా టెస్టులు చేస్తారు. ఒకవేళ ఎవరైనా ఈ నిబంధనలను అతిక్రమించి బయటకు వెళ్తే.. క్వారంటైన్ పూర్తిచేయాల్సి ఉంటుంది.