Begin typing your search above and press return to search.

సుంద‌రం.. లీలా థామ‌స్ వ‌చ్చేసింది

By:  Tupaki Desk   |   17 March 2022 11:59 AM GMT
సుంద‌రం.. లీలా థామ‌స్ వ‌చ్చేసింది
X
నేచుర‌ల్ స్టార్ నాని బ్యాక్ టు బ్యాక్ సినిమాల‌తో బిజీగా వున్నారు. ప్ర‌స్తుతం ఆయ‌న రెండు చిత్రాల్లో న‌టిస్తున్నారు. ఒక‌టి ద‌స‌రా. రెండు `అంటే సుంద‌రానికి`. ఈ చిత్రాన్ని `బ్రోచేవారెవ‌రురా` ఫేమ్ వివేక్ ఆత్రేయ తెర‌కెక్కిస్తున్నారు. మైత్రీ మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్ పై అత్యంత భారీ స్థాయిలో ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఇందులో నాని విభిన్న‌మైన పాత్ర‌లో న‌టిస్తున్నారు. రొమాంటిక్ రామెడీ ఎంట‌ర్ టైన‌ర్ గా రూపొందుతున్న ఈ మూవీ చిత్రీక‌ర‌ణ పూర్తి చేసుకుని ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంటోంది.

రెగ్యుల‌ర్ చిత్రాల‌కు కాస్త భిన్నంగా తెర‌కెక్కుతున్న ఈ మూవీలో హీరో నానికి జోడీగా మ‌ల‌యాళ న‌టి న‌జ్రియా న‌జీమ్ న‌టిస్తోంది. ఇటీవ‌ల హీరో పాత్ర‌కు సంబంధించిన ప్ర‌చార‌ చిత్రాల‌ని విడుద‌ల చేసి ఆక‌ట్టుకున్న చిత్ర బృందం తాజాగా గురువారం హీరోయిన్ ని, ఆమె పాత్ర‌ని ప‌రిచ‌యం చేస్తూ ఓ వీడియోని విడుద‌ల చేసింది. ఇందులో న‌జ్రియా పేరు లీలా థామ‌స్‌. ఫొటోగ్ర‌ఫీ అంటే పాష‌న్ వున్న యువ‌తిగా ఇందులో క‌నిపించ‌బోతోంది.

క్రిస్టియ‌న్ యువ‌తిగా న‌జ్రియా పాత్ర‌ని ప‌రిచ‌యం చేస్తూ మేక‌ర్స్ రిలీజ్ చేసిన వీడియో ప్ర‌స్తుతం నెట్టింట ఆక‌ట్టుకుంటోంది. యువ సుంద‌రుడి బ‌ర్డ్ డే హోమం మొద‌లైంది అంటూ యంగ్ సుంద‌రం ప్ర‌త్యేక వీడియోని విడుద‌ల చేసి సినిమాపై ఆస‌క్తిని రేకెత్తించిన చిత్ర బృందం తాజాగా హీరోయిన్ పాత్ర‌ని, ఆమె పాత్ర పేరుని, పాష‌న్ ని రివీల్ చేస్తూ విడుద‌ల చేసిన తాజా వీడియో చాలా ఇంట్రెస్టింగ్ వుంది. సినిమాలో హీరో నాని, హీరోయిన్ న‌జ్రియాల పాత్ర‌లు క్వైట్ అపోజిట్ గా వున్న‌ట్టుగా తెలుస్తోంది.

అంతే కాకుండా విడుద‌ల చేసిన వీడియోలో గ‌తాన్ని ప‌క్క‌న పెట్టి కొత్త భ‌విష్య‌త్తుని త‌న‌కు అందించ‌మ‌ని హీరోయిన్ జీసెస్ ని హీరోయిన్ ప్రార్టిస్తూ అడుగుతున్న తీరు కొత్త‌గా వుంది. పాత్ర కూడా అంతే కొత్త‌గా వుంటుంద‌ని ఈ వీడియోతో మేక‌ర్స్ క్లారిటీ ఇచ్చిన‌ట్టుగా తెలుస్తోంది.

నేచుర‌ల్ స్టార్ నాని త‌న రెగ్యుల‌ర్ పంథాకు పూర్తి భిన్నంగా రొమాంటిక్ ఎంట‌ర్ టైన‌ర్ క‌థ‌తో చేస్తున్న ఈ మూవీ ఇప్ప‌టికే చిత్రీక‌ర‌ణ పూర్త‌యి ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంటోంది. అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తి చేసి చిత్రాన్ని జూన్ 10న విడుద‌ల చేయాల‌ని మేక‌ర్స్ ఇప్ప‌టికే రిలీజ్ డేట్ ని కూడా ప్ర‌క‌టించేశారు.