Begin typing your search above and press return to search.

''ప్రయాణికుడు'' ట్రైలర్: 'మనిషిని చంపొచ్చు కానీ ఆశయాన్ని చంపలేరు'

By:  Tupaki Desk   |   5 April 2021 12:22 PM
ప్రయాణికుడు ట్రైలర్: మనిషిని చంపొచ్చు కానీ ఆశయాన్ని చంపలేరు
X
అమ‌రం అఖిలం ప్రేమ‌' సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు జోనాధ‌న్ ఎడ్వ‌ర్డ్స్.. ఇప్పుడు ''ప్రయాణికుడు'' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఇందులో కృష్ణ చైతన్య - పావని ప్రధాన పాత్రలు పోషించారు. ఇన్ఫీనిట్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పై ఎమ్.కృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఏప్రిల్ 13న ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు సినిమాపై ఆసక్తిని కలిగించాయి. ఈ క్రమంలో తాజాగా 'ప్రయాణికుడు' చిత్రానికి సంబంధించిన ట్రైలర్ ను చిత్ర బృందం రిలీజ్ చేసింది.

'నాన్నా.. నిన్ను చంపేస్తారా' అని ఒక పాప అడుగగా.. 'లేదు నాన్నా.. మనిషిని చంపొచ్చు కానీ ఆశయాన్ని చంపలేరు' అని తండ్రి చెప్పే డైలాగ్ తో ఈ ట్రైలర్ ప్రారంభమైంది. ఉద్యోగం కోసం సిటీకి వచ్చిన ఓ మెకానిక్.. అనుకోని పరిస్థితుల్లో నేర ప్రపంచంలోకి వెళ్లడం.. అక్కడ అప్పటికే రాజ్యమేలుతున్న రౌడీని ఢీకొట్టే క్రమంలో అతనికి ఎదురైన సంఘటనలను ఈ ట్రైలర్ లో చూపించారు. అలానే ఇందులో హీరో ఓ అమ్మాయిని ప్రేమించడం.. దానికి అమ్మాయి పేరెంట్స్ ఒప్పుకోకపోవడం వంటి వాటిని కూడా ప్రస్తావించారు. 'శత్రువు కంటే పగ చాలా భయంకరమైనది' వంటి డైలాగ్స్ బాగున్నాయి. దీనికి పవన్ కుమార్ అందించిన బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అదనపు ఆకర్షణగా నిలిచింది.

రాహుల్ మాచినేని ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ అందించగా.. కార్తీక్ శ్రీనివాస్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తించారు. మధు పొన్నాస్ సంగీతం సమకూర్చారు. ఈ చిత్రంలో రాయల హరిచంద్ర - వేణు పొలాసాని - బీపీ ప్రసాద్ - దాసరి నాగేశ్వరరావు తదితరులు ఇతర పాత్రలు పోషించారు. ట్రైలర్ తోనే ఇంట్రెస్ట్ క్రియేట్ చేసిన 'ప్రయాణికుడు' ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.