Begin typing your search above and press return to search.

ఆ డైరక్టర్ కోసం రాజశేఖర్‌ ఖాకీ వేస్తుండు

By:  Tupaki Desk   |   26 Jun 2016 7:30 AM GMT
ఆ డైరక్టర్ కోసం రాజశేఖర్‌ ఖాకీ వేస్తుండు
X
ఇప్పుడు బాగా స్లో అయిపోయాడు కానీ.. ఒకప్పుడు ఖాకీ డ్రస్సుకి కేరాఫ్ అడ్రస్ నేనే అన్నట్లుగా ఉండేది రాజశేఖర్ వ్యవహారం. మధ్యలో లవ్ ట్రాక్ పట్టడం.. రొమాంటిక్ సినిమాలు ట్రై చేయడం.. డిఫరెంట్ కాన్సెప్టులతో ప్రయోగాలు చేయడంతో.. కెరీర్ బాగా డిస్టర్బ్ అయిపోయి ఇప్పుడు విలన్ రోల్ కి సై అనాల్సి వచ్చింది. ఒకప్పుడైతే యాంగ్రీ యంగ్ మ్యాన్ రోల్స్ కి రాజశేఖర్ సరిగ్గా సరిపోయేవాడు.

అంకుశం తర్వాత రాజశేఖర్ ఈ రోల్స్ లో సెట్ అయిపోయాడు. దాని స్ఫూర్తితో తెలుగులో చాలానే పోలీస్ సినిమాలు వచ్చాయి. అయితే.. రాజశేఖర్ కి కూడా అంకుశం తర్వాత అంతగా పేరు రాలేదు. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత మరోసారి రాజశేఖర్ ని అంకుశం లాంటి పవర్ ఫుల్ పాత్రలో చూపిస్తానంటున్నాడు దర్శకుడు ప్రవీణ్ సత్తారు. గతంలో అవార్డ్ విన్నింగ్ సినిమాలు తీసినా ఆడకపోవడంతో.. రీసెంట్ గా గుంటూరు టాకీస్ అనే సెమీ బూతు సినిమాతో సక్సెస్ కొట్టాడీ డైరెక్టర్.

ఈ ప్రవీణ్ సత్తారు దగ్గర ఎప్పటి నుంచో రాజశేఖర్ కోసం ఓ కథ ఉందట. తాజాగా ఈ స్టోరీని చెబితే.. వెంటనే చేసేద్దామన్నాడట ఆ హీరో. దీంతో త్వరలో ఈ ప్రాజెక్టు పట్టాలెక్కించే ప్రయత్నాలు మొదలయ్యాయి. ఇప్పుడు పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలు చేసినంత మాత్రాన.. రాజశేఖర్ ని ఇప్పుడు ఆడియన్స్ ఏ రకంగా రిసీవ్ చేసుకుంటారో చూడాలి.