Begin typing your search above and press return to search.

సన్నీ తప్ప ఇంకెవ్వరూ కనిపించలేదట

By:  Tupaki Desk   |   9 March 2017 11:44 AM GMT
సన్నీ తప్ప ఇంకెవ్వరూ కనిపించలేదట
X
సీనియర్ హీరో రాజశేఖర్ రీఎంట్రీ మూవీ ‘గరుడ వేగ’లో ఒకప్పటి శృంగార తార సన్నీ లియోన్ ఓ స్పెషల్ సాంగ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఈ పాట అనుకోగానే తనకు సన్నీ తప్ప మరో పేరే గుర్తుకు రాలేదంటున్నాడు దర్శకుడు ప్రవీణ్ సత్తారు.

‘‘ఈ పాట పెట్టాలనుకున్నపుడు నాకు సన్నీ లియోన్ మాత్రమే తలపుల్లోకి వచ్చింది. వెంటనే నిర్మాతలకు కూడా ఆమె పేరే సూచించాను. ఈ పాట సినిమాలో కీలక సందర్భంలో వస్తుంది. జనాలకు బాగా తెలిసిన అమ్మాయైతే బాగుంటుందనిపించింది. తెలుగులో ఈ పాట చేయడానికి చాలామంది అందుబాటులో ఉన్నప్పటికీ.. సన్నీ అయితే జనాలకు బాగా కనెక్టవుతుందని ఆమెనే ఈ పాటకు ఎంపిక చేశాం’’ అని ప్రవీణ్ సత్తారు తెలిపాడు.

అందరూ అనుకుంటున్నట్లు ఇది ఐటెం సాంగ్ కాదని ప్రవీణ్ అన్నాడు. ‘‘ఇది కథలో భాగంగా.. కథను నరేట్ చేస్తూ సాగే పాట. దీన్ని కేవలం ఒక ఐటెం సాంగ్ లాగా చూడలేం. ద్వితీయార్ధంలో ఈ ఒక్క పాటే ఉంటుంది. సన్నీ సెక్సీ అవతారంలో కనిపిస్తుంది. ఈ పాటను కేరళలో చిత్రీకరించనున్నాం’’ అని ప్రవీణ్ తెలిపాడు. రాజశేఖర్ ఇందులో నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ ఆఫీసర్ పాత్ర పోషిస్తున్నాడు. ఇందులో ఆయన సరసన ‘విశ్వరూపం’ భామ పూజా కుమార్ నటిస్తోంది. శ్రద్ధా దాస్.. అదిత్ అరుణ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. వేసవిలో ఈ చిత్రం రిలీజవుతుంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/