Begin typing your search above and press return to search.

టాకీస్ దర్శకుడితో సిద్ధు లవ్ స్టోరీ

By:  Tupaki Desk   |   4 April 2016 5:30 AM GMT
టాకీస్ దర్శకుడితో సిద్ధు లవ్ స్టోరీ
X
లవర్ బోయ్ గా చాలానే సినిమాలు చేసినా.. సిద్ధుని బొమ్మరిల్లు సిద్ధార్ధ్ గానే టాలీవుడ్ జనాలు ఫిక్సయిపోయారు. అయితే ఆ తర్వాత అలాంటి మ్యాజిక్ చేయలేకపోవడంతో తెలుగు ఇండస్ట్రీకి దూరమై, తమిళ్ లోనే బిజీ అయిపోయాడు సిద్ధార్ధ్. మూడేళ్ల క్రితం ఎన్టీఆర్-శ్రీనువైట్ల కాంబినేషన్ లో వచ్చిన బాద్షా మూవీలో కేమియో తప్ప.. సిద్ధూ తెలుగు సినిమాను చేయలేదు. రీసెంట్ గా కళావతి వచ్చినా.. అది డబ్బింగ్ సినిమానే.

ఇప్పుడు సిద్ధార్ధ్ ఓ డైరెక్ట్ తెలుగు చిత్రానికి అంగీకరించాడు. రీసెంట్ గా కన్ఫ్యూజన్ - క్రైమ్ అండ్ బోల్డ్ కామెడీతో హిట్ కొట్టిన ప్రవీణ్ సత్తారు... ఓ క్యూట్ లవ్ స్టోరీ సిద్ధార్ధ్ కోసం సిద్ధం చేశాడు. మూడేళ్ల తర్వాత డైరెక్ట్ మూవీ కావడంతో.. టాలీవుడ్ రీ ఎంట్రీ అనాల్సిందే. సున్నితమైన అంశాలను డీల్ చేసే ఓ ప్రేమకథలో సిద్ధార్ధ్ కనిపిస్తాడని.. ఇందులో ఎమోషన్స్ కు ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుందని చెబ్తున్నాడు దర్శకుడు ప్రవీణ్ సత్తారు.

సంగీత ప్రాధాన్యంగా ఈ సినిమా ఉంటుందని, ఎక్కువ భాగం లడఖ్ లోను - హైద్రాబాద్ - శ్రీశైలంలో మిగిలిన షూటింగ్ పూర్తి చేస్తామని చెప్పాడు దర్శకుడు. అయితే ఈ మూవీలో ఇంకా హీరోయిన్ ని మాత్రం ఫైనలైజ్ చేయలేదట. కొత్త అమ్మాయి అయితే లవ్ ఫీల్ ఫ్రెష్ గా ఉంటుందని సిద్ధూ సూచించినట్లు సమాచారం.